Parliament: పార్లమెంటు భద్రత కట్టుదిట్టం

Parliament: ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలు

Update: 2024-01-24 05:45 GMT

Parliament: పార్లమెంటు భద్రత కట్టుదిట్టం

Parliament: పార్లమెంటు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా 140 మందితో బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరిలో 36 మంది సీఐఎస్‌ఎఫ్‌ అగ్నిమాపక విభాగానికి చెందినవారు ఉన్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సందర్శకులతో పాటు వారి సామగ్రిని CISF బృందం క్షుణ్నంగా తనిఖీ చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 13న పార్లమెంటులో చొరబాటు ఘటన తర్వాత.. భద్రతపై సమీక్షించిన అనంతరం కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, పార్లమెంటు వెలుపల కానీ, బయట కానీ ఫొటోలు తీయకూడదంటూ సిబ్బందిని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు పార్లమెంట్‌ హౌస్‌ తాత్కాలిక జాయింట్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పదేపదే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంతమంది సిబ్బంది పార్లమెంటుకు సంబంధించిన ఫొటోలను సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరిస్తున్నారని జాయింట్‌ సెక్రటరీ తెలిపారు.

Tags:    

Similar News