శబరిమల యాత్రకు ఆన్ లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం

శబరిమల యాత్ర కోసం పేర్లను ముందుగానే నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమయింది.

Update: 2019-10-30 07:04 GMT

 ప్రతి ఏటా కొన్నివేల మంది భక్తులు శబరిమలకు వారి మొక్కులు తీర్చుకోవడానికి వెళుతుంటారు. అలాంటి భక్తులకు ప్రయాణ కాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శబరిమల యాత్ర కోసం పేర్లను ముందుగానే నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమయింది.

భక్తులు www.sabarimalaonline.org లో లాగిన్‌ అయివారి పేరు, వయసు, చిరునామా, ఫొటో, స్కాన్‌ చేసిన గుర్తింపు కార్డులు, మొబైల్‌ నెంబర్‌ వివరాలతో ముందుగా బుకింగ్‌ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు శబరిమల వెళ్ళే పిల్లలకు బుకింగ్‌ అవసరం లేదు. పాటశాలలకు వెళ్ళే పిల్లలు వారి ఐడీ కార్డు జతచేసి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ప్రతి సేవకు ఆన్‌లైన్‌ కూపన్‌ అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌ చేసుకున్నాక యాత్ర సమయం, తేదీని సేవ్‌ చేసి స్వామి దర్శన "క్యూ కూపన్‌ ప్రింట్‌ తీసుకోవాలి. యాత్రకు వెళ్లేటప్పుడు బుకింగ్ పత్రాలతో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. 


Tags:    

Similar News