నితిన్ చేయాల్సిన సినిమా ఇప్పుడు విశ్వక్ చేస్తున్నారా?

* నితిన్ నుండి విశ్వక్ సేన్ కి చేరిన సినిమా

Update: 2023-03-30 13:30 GMT

నితిన్ చేయాల్సిన సినిమా ఇప్పుడు విశ్వక్ చేస్తున్నారా?

Vishwak Sen: ఒక హీరో కోసం అనుకున్న కథ మరొక హీరో చేతికి వెళ్ళటం ఇప్పటికే చాలాసార్లు జరిగింది. కానీ కథకి నో చెప్పిన హీరో తీసుకున్నది సరైన నిర్ణయమా కాదా అన్నది సినిమా విడుదల అయ్యాక రిజల్ట్ ని బట్టి చెప్పగలం. తాజాగా ఇవాళ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం వారు విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాని ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఎక్కువ వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. కానీ సినిమాని కేవలం లాంచ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లు కూడా సితార వారు రివీల్ చేశారు. అయితే ఈ సినిమా ముందు నితిన్ చేయాల్సింది. "రౌడీ ఫెలో" ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ తో కృష్ణ చైతన్య "చల్ మోహన్ రంగా" సినిమాని తీశారు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో త్రివిక్రమ్ పర్యవేక్షణలో విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత డైరెక్టర్ నితిన్ తోని గుంటూరు బ్యాక్ డ్రాప్ లో "పవర్ పేట" అనే టైటిల్తో ఒక గ్యాంగ్స్టర్ డ్రామాని ప్లాన్ చేశారు. స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. కానీ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. చాలాకాలం తర్వాత నితిన్ కూడా డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు అదే కదా నీ డైరెక్టర్ విశ్వక్ సేన్ తో తీస్తున్నారు అని తెలుస్తుంది. "దాస్ కా ధమ్ కీ" సినిమాతో హిట్ అందుకోలేకపోయిన విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటారు వేచి చూడాలి.

Tags:    

Similar News