SP Balu Fake Rumors on Janaki Health:ఎస్ జాన‌కి మ‌ర‌ణ వార్త‌పై మండిప‌డ్డ సింగర్ ఎస్పీ బాలు..

SP Balu Fake Rumors on Janaki Health: సోషల్ మీడియా వచ్చాక ఒక న్యూస్ స్ప్రెడ్ కావడానికి పెద్దగా టైమ్ పట్టడం లేదు.. ఇక ఫేక్ న్యూస్ లకి అయితే లెక్కే లేదు.. పెట్టిన కొద్ది నిమిషాల్లోనే న్యూస్ వైరల్ అవుతుంది

Update: 2020-06-29 06:40 GMT

SP Balu Fake Rumors on Janaki Health: సోషల్ మీడియా వచ్చాక ఒక న్యూస్ స్ప్రెడ్ కావడానికి పెద్దగా టైమ్ పట్టడం లేదు.. ఇక ఫేక్ న్యూస్ లకి అయితే లెక్కే లేదు.. పెట్టిన కొద్ది నిమిషాల్లోనే న్యూస్ వైరల్ అవుతుంది.. తాజాగా ది గ్రేట్ సింగర్ ఎస్ జానకీ ఇక లేరన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ వార్తలను ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. వైద్యం కోసం ఆమె ఆసుప‌త్రికి వెళ్ళార‌ని, ప్ర‌స్తుతం ఆమె క్షేమంగా ఉన్నారని వారు వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఈ వార్తల పైన ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు మండిపడ్డారు..

ఇలాంటి వార్తలు విన్నప్పుడు కొందరు స్టార్ అభిమానులకి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.. అలా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. కొంద‌రు విచ‌క్ష‌ణ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారని బాలు మండిపడ్డారు.. ఇక జాన‌క‌మ్మ‌తో తాను మాట్లాడానని, ఆమె క్షేమంగా ఉన్నారని బాలు క్లారిటీ ఇచ్చారు.. ఇక సోషల్ మీడియాను మంచి ప‌నుల కోసం వాడుకోవాలని ఇలా నెగెటివిటీ ప్ర‌చారం కోస‌మో వాడొద్దు అంటూ నెటిజన్లుకు హితవు పలికారు బాలు..

50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు ఎస్ జానకీ.. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె పాటలు పాడారు.. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు..ఆమె ఎక్కువగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు పాడారు.. ఎస్పీ బాలుతో ఆమె ఎక్కువగా పాటలను పంచుకున్నారు. ఇక సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు జానకీ..

ఒక గాయనిగా 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం అంటే మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఇంకా ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం అనేది మరో గొప్ప విశేషం..


Tags:    

Similar News