Sai Dharam Tej: హీరో సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం

Sai Dharam Tej: కేబుల్‌ బ్రిడ్జి దగ్గర స్కిడ్‌ అయిన స్పోర్ట్స్‌ బైక్

Update: 2021-09-11 02:05 GMT

రోడ్ ప్రమాదం లో హీరో సాయిధర్మ తేజ్ కు త్రేవ్ర గాయాలు (ఫైల్ ఇమేజ్)

Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అర్ధరాత్రి అపోలో హాస్పిటల్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్‌బోన్‌ విరిగిందని.., ఆయన ఇంకా 48 గంటలపాటు తమ పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

మరోవైపు అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రమాదంలో స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని తెలియజేశారు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ క్రమంగా కోలుకుంటున్నారని.. టెన్షన్‌ వద్దని తెలిపారు.

మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్‌ డ్రైవింగ్‌ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ప్రమాద స్థలంలో స్పోర్ట్స్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌ చలాన్‌ ఉంది. 2020 ఆగస్ట్‌ 2వ తేదీన ఓవర్‌ స్పీడ్‌ నేపథ్యంలో చలాన్‌ పడింది.

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈ ఫుటేజీలో బైక్‌పై వస్తున్న సాయిధరమ్‌ తేజ్‌.., తన ముందున్న బైక్‌, ఆటోను ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్‌ ముందువైపు చక్రం ఒక్కసారిగా స్కిడ్‌ అయ్యింది. దాంతో సాయితేజ్‌ బైక్‌తో సహా కిందపడిపోయాడు. ఇక రోడ్డుపై పడిపోయిన వెంటనే సాయిధరమ్‌ తేజ్‌ తలకు ఉన్న హెల్మెట్‌ ఎగిరిపోయింది. అదృష్టవశాత్తు తలకు గాయాలు కాలేదు.

కేబుల్‌ బ్రిడ్జిపై స్పోర్ట్స్‌ బైక్‌పై నుండి సాయిధరమ్‌ తేజ్‌ కిందపడిపోయాడు. కాగా.. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇతర కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకున్నారు.

Similar News