కేవలం ఆ రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలి : పోలీసులు

Update: 2019-10-25 14:03 GMT

దీపావళి అంటే మనకి టక్కున గుర్తొచ్చేది టపాసులు మాత్రమే.. కానీ టపాసులు కాల్చడం వలన పర్యావరణం పాడైపోతుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. దానివల్ల వీటిని పూర్తిగా పూర్తి నిషేధించలేం కానీ, కేవలం రెండు గంటలు మాత్రమే కాల్చాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సారి దీపావళి కూడా కేవలం రెండు గంటలే నిబంధన అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Tags:    

Similar News