"I Don't Care About 20-Year Age Gap Criticism": రణవీర్ సింగ్‌తో 20 ఏళ్ల వ్యత్యాసం.. ఆ విమర్శలను అస్సలు పట్టించుకోను: సారా అర్జున్

రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాలో హీరోయిన్ సారా అర్జున్ వయస్సు వ్యత్యాసంపై వస్తున్న విమర్శలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ వివాదంపై సారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Update: 2026-01-21 09:32 GMT

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్' (Dhurandhar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో, అంతకంటే ఎక్కువగా హీరో హీరోయిన్ల మధ్య ఉన్న 20 ఏళ్ల వయస్సు వ్యత్యాసం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రణవీర్ సరసన నటించిన సారా అర్జున్ (బాలనటిగా చిరపరిచితురాలు) వయస్సుపై వస్తున్న విమర్శలపై ఆమె తాజాగా స్పందించింది.

విమర్శలు నావరకు రాలేదు!

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సారా అర్జున్ మాట్లాడుతూ.. "ఈ వయస్సు వ్యత్యాసంపై వస్తున్న విమర్శలన్నీ సోషల్ మీడియాకే పరిమితం. నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను, అందుకే ఆ కామెంట్స్ ఏవీ నావరకు రాలేదు. ప్రతి ఒక్కరికీ ఒక విషయంపై తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. నేను 'మనం ప్రశాంతంగా ఉందాం.. ఇతరులని ఉండనిద్దాం' అనే సూత్రాన్ని నమ్ముతాను" అని తేల్చి చెప్పింది.

కథ నచ్చితేనే ఓకే చెప్పాను

"నాకు 'ధురంధర్' కథ బాగా నచ్చింది. ఈ పాత్రకు నేను న్యాయం చేయగలనని నమ్మకం కలిగిన తర్వాతే సినిమాకు సంతకం చేశాను. టీజర్ వచ్చినప్పుడు ఈ వయస్సు గ్యాప్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఆ సమయంలో నేను కనీసం ఫోన్ కూడా చూడలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే, విరామం దొరికితే ట్రిప్స్‌కు వెళ్లడం నాకు ఇష్టం" అని సారా చెప్పుకొచ్చింది.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ

ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,283 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్లలో ఇప్పటికీ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Tags:    

Similar News