TFCC: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా దిల్ రాజు
TFCC: అధ్యక్ష ఎన్నికల్లో 48 ఓట్లలో దిల్‌రాజుకు 31 ఓట్లు
TFCC: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విజయం సాధించారు. ప్రత్యర్థి నిర్మాత సి.కల్యాణ్‌పై గెలుపొందారు. టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ గెలుపొందారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు బరిలోకి దిగారు.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు సహా సుమారు 2 వేలకు పైగా టీఎఫ్‌సీసీలో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల సెక్టార్ నుంచి సుమారు 1,500 మంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 500, స్టూడియోల నుంచి 98 మంది సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. తొలుత పలు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిచినా.. సిబ్బంది ఆ సమస్యలను పరిష్కరించడంతో తర్వాత సజావుగా సాగింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో 48 ఓట్లలో దిల్‌రాజుకు 31 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన మ్యాజిక్ ఫిగర్ 25 కంటే 6 ఓట్లు ఎక్కువ సాధించారు. ఆయన ప్రత్యర్థి సి. కల్యాణ్‌కు 17 ఓట్లు పోలయ్యాయి. కాగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. 2262 మంది సభ్యులకు గాను.. మొత్తం 1,339 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో.. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ ముందుకెళ్లగా.. చిన్న సినిమా నిర్మాతల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్ పోటీలో నిలిచాయి.
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్ చాంబర్‌కు జరిగే ఎన్నికల్లో నిర్మాతలు దిల్‌రాజు, సి. కల్యాణ్ బరిలో నిలిచారు. కాగా 2023 - 25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ పలు కీలక పోస్టులను కైవసం చేసుకుంది.