వర్షాకాలంలో ఎక్కువగా కరెంట్ షాక్‌లు ఎందుకు వస్తాయో తెలుసా? ఇంట్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా చేయండి!
వర్షాకాలం చాలా మందికి ఇష్టమైన కాలం. చల్లని వాతావరణం, వాన రాకతో ఆహ్లాదకరమైన అనుభూతి కలిగినా.. అదే సమయంలో కొన్ని ప్రమాదాలనూ దాచిపెడుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కరెంట్ షాక్‌లు తగలే ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి.
వర్షాకాలంలో ఎక్కువగా కరెంట్ షాక్‌లు ఎందుకు వస్తాయో తెలుసా? ఇంట్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా చేయండి!
వర్షాకాలం చాలా మందికి ఇష్టమైన కాలం. చల్లని వాతావరణం, వాన రాకతో ఆహ్లాదకరమైన అనుభూతి కలిగినా.. అదే సమయంలో కొన్ని ప్రమాదాలనూ దాచిపెడుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కరెంట్ షాక్‌లు తగలే ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఉరుములు, మెరుపులు, తుఫానుల వల్ల చెట్లు విరిగిపోవడం, కరెంట్ లైన్లు తెగిపోవడం వంటి ఘటనలు జరగడం సహజం. అలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇంట్లో కరెంట్ సంబంధిత ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే.
ఇంట్లో ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయేమో తొందరగా చెక్ చేసుకోవాలి. పాతగా మారిన, తుడిచిన ప్లగ్ పాయింట్లు, స్విచ్ బోర్డ్స్, వైర్లు ఉంటే అవి వెంటనే మార్చించాలి. వాటి వల్లే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటర్ హీటర్, ఫ్రిజ్ లాంటి గృహోపకరణాలు ప్లగ్ చేసే సమయంలోనూ జాగ్రత్త అవసరం. స్విచ్ పాయింట్ల దగ్గర పిల్లలు ఆడకుండా చూడాలి.
వర్షాల కారణంగా ఇళ్లలో తడిగా మారిన గోడల వల్ల నీరు వైర్ల మీదకు చేరే అవకాశముంటుంది. ఇది కరెంట్ షాక్‌లకు దారితీస్తుంది. అందుకే వాటర్‌ప్రూఫ్ పరికరాలను ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల ప్రమాదాలను తక్కువయ్యే అవకాశం ఉంటుంది.
తడి చేతులతో ఎలక్ట్రిక్ పరికరాలను, స్విచ్‌లు, ప్లగ్‌లను ముట్టుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించే ముందు చేతులు బాగా తుడిచేయాలి లేదా ఆరిపోయిన తర్వాతే ముట్టుకోవాలి. అలాగే ప్లగ్ పాయింట్లపైకి నీరు వెళ్లకుండా చూడాలి.
ఎర్తింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదంటే వెంటనే చెక్ చేయించాలి. సరైన ఎర్తింగ్ లేకపోతే కరెంట్ పరికరాలు షాక్ ఇవ్వడం మొదలవుతుంది. వర్షాకాలం రాకముందే ఒకసారి ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి అన్ని వ్యవస్థలను తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.
ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు వంటి పరికరాలను గోడలకు అతి దగ్గరగా ఉంచకూడదు. వర్షాల సమయంలో గోడలు తేమగా మారే అవకాశం ఉంటుంది. అది కరెంట్ లీకేజ్‌కు దారితీస్తుంది. కనీసం కొంత దూరం గోడల నుండి ఉంచడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
వర్షాలు పడుతున్న సమయంలో, ఇంట్లో ఉపయోగంలో లేని ప్లగ్‌లు అన్నింటినీ తొలగించాలి. టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్లు, ఫోన్ చార్జర్లు వంటి పరికరాలను అన్‌ప్లగ్ చేయడం వల్ల అవి పాడవడాన్ని నివారించవచ్చు. అంతేగాక వర్షంతో సంబంధం ఉన్న ఎలక్ట్రిక్ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, వర్షాకాలం అందమైనప్పటికీ అప్రమత్తత లేకుంటే ప్రమాదాలు తలెత్తవచ్చు. ఇంట్లో చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కరెంట్ షాక్‌ల వంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు.