What is Black Magic: చేతబడులు నిజంగానే ఉన్నాయా? నిజం ఏమిటి?
చేతబడి ఆరోపణలతో హత్యలు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
What is Black Magic: చేతబడులు నిజంగానే ఉన్నాయా? నిజం ఏమిటి?
చేతబడి ఆరోపణలతో హత్యలు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢనమ్మకాలు బలంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. జనం ఇప్పటికీ రోగాలు, అనర్థాలు మంత్రాలతోనే వస్తాయని నమ్ముతున్నారు.
చేతబడి అంటే ఏమిటి?
చేతబడి లేదా Black Magic (Witchcraft) అనేది మంత్రశక్తి అని భావిస్తారు. కొందరు మంత్రగాళ్లు మనుషుల గోర్లు, జుట్టు వంటివి సేకరించి మంత్రప్రయోగం చేసి బాధలు పెడతారని ఒక విశ్వాసం ఉంది. దీన్నే కొన్నిచోట్ల బాణామతి లేదా చిల్లంగి అని కూడా పిలుస్తారు. పాతకాలంలో శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్ని వాడేవారని కొన్ని గ్రంథాలు చెబుతాయి.
అయితే హేతువాదులు మాత్రం ఇది వాస్తవం కాదని, కొందరు మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు సృష్టించిన నమ్మకం మాత్రమేనని అంటున్నారు.
తంత్ర శాస్త్రం ప్రకారం
తంత్ర శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో అనూహ్య నష్టాలు, మానసిక ఒత్తిడి, భయం లేదా డిప్రెషన్ వస్తే అది ప్రతికూల శక్తి ప్రభావం (Negative Energy) కావచ్చని నమ్ముతారు. చేతబడితో బాధపడుతున్నవారు వింత ప్రవర్తన చేయడం మొదలుపెడతారని తంత్ర శాస్త్రం చెబుతుంది.
మూఢనమ్మకాల వాస్తవం
ప్రభుత్వ వెబ్‌సైట్ Vikaspedia ప్రకారం, చేతబడి, బాణామతి, మంత్రాలు అన్నీ కల్పితాలు మాత్రమే. మూఢనమ్మకాల వల్లే అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2000లో వరంగల్ జిల్లాలో చేతబడి ఆరోపణలతో ఐదుగురిని సజీవ దహనం చేసిన ఘటన దీనికి ఉదాహరణ.
మూఢనమ్మకాలను ఎలా తగ్గించాలి?
శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, హేతుబద్ధ ఆలోచనను ప్రోత్సహించడం, సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ద్వారానే ఈ మూఢనమ్మకాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ వ్యాసంలోని సమాచారం పలు వెబ్‌సైట్లు, మతగ్రంథాలు, ప్రజా నమ్మకాల ఆధారంగా సేకరించబడింది. వాస్తవంగా చేతబడులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారణ కాని విషయం. నమ్మడం లేదా నమ్మకపోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం.