విటమిన్ల లోపం.. మహిళలకు శాపం!

Update: 2019-12-11 11:07 GMT

ఉరుకుల పరుగుల జీవితంలో నగర వాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగ మహిళలు, పిల్లలు విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. పోషకాలు కల్గిన ఆహరం తీసుకోకపోవడంతోనే అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, పోషకాహారం తీసుకోక పోవడంతో విటమిన్ల లోపం ఉంటుందంటున్నారు వైద్యులు.

మహిళలు ఏ చిన్న పని చేసినా ఆయసం రావడం నవడానికి ఓపిక లేకపోవడం కొద్దిపాటి బరువును కూడా ఎత్తలేకపోతున్నారు. విటమిన్స్ లోపంకారణంగానే డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో ఎక్కువ మంది డీ. బీ, విటమిన్ల డెఫిషీయన్సీ, పిల్లల్లో ఏ, సీ, డీ విటమిన్ లోపం ఉన్నాయని చెబుతున్నారు. వందలో 60 మంది పిల్లలు విటమిన్ ఏ డెఫిషియన్సీ లోపంతో డయబెటిస్, గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారని, బీ విటమిన్ తక్కువుంటే మెదడుపై ఎఫెక్ట్ ఇలా చాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మారుతున్న జీవన శైలిలో సరైన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు, గుడ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినిపించాలని సూచిస్తున్నారు నూట్రీషన్లు. ఇక మహిళల విషయానికి వస్తే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారని, పౌష్టక ఆహారం తీసుకోవడం లేదని వైద్యులు అంటున్నారు. దీంతో రక్త హీనత, ఐరన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు కేవలం ఆహరం ద్వారానే కాకుండా కాస్త ఎండ వేడమిలో నడవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఎంత ఎక్కవ భాగానికి సూర్యరశ్మి తగిలితే అంత తక్కువ సమయంలో విటమిన్ డీ లభిస్తుందని చెబుతున్నారు.

Full View  

Tags:    

Similar News