Dengue Diet: డెంగ్యూ నుంచి కోలుకోవాలంటే ఈ పండ్లు తప్పనిసరి తినాలి..!

Dengue Diet: డెంగ్యూ నుంచి కోలుకోవాలంటే ఈ పండ్లు తప్పనిసరి తినాలి..!

Update: 2022-11-27 16:00 GMT

Dengue Diet: డెంగ్యూ నుంచి కోలుకోవాలంటే ఈ పండ్లు తప్పనిసరి తినాలి..!

Dengue Diet: డెంగ్యూ అనేది దోమ కాటు వల్ల సంభవిస్తుంది. దీని కారణంగా తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి సమయంలో శరీరంలో ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతాయి. దీంతో ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. డైట్‌లో అనేక రకాల పండ్లను చేర్చుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

దానిమ్మ

దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. డెంగ్యూని త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది.

కివి

కివి విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇందులో రాగి ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, విటమిన్ ఈ, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడతాయి. కివి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు డెంగ్యూతో పోరాడడంలో సహాయపడతాయి.

సిట్రస్‌ జాతి పండ్లు

డెంగ్యూ రోగులకు సిట్రస్ పండ్లు చాలా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. ఇది డెంగ్యూ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది అలసటను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

బొప్పాయి

బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది వాపు నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూతో పోరాడడంలో బొప్పాయి ఆకులు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇవి ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి.

డ్రాగన్ ఫ్రూట్‌

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరం సమయంలో ఎముకలలో తరచుగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ సందర్భంలో డ్రాగన్ ఫ్రూట్ ఎముకలను బలంగా చేస్తుంది.

Tags:    

Similar News