ఈ లక్షణాలుంటే థైరాయిడ్‌ క్యాన్సర్.. ఇది చాలా ప్రాణాంతకం..!

Thyroid Cancer: చాలా రోజులుగా గొంతులో నొప్పిగా ఉన్నా.. ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నా అది థైరాయిడ్ క్యాన్సర్‌ లక్షణం అయ్యే అవకాశం ఉంటుంది.

Update: 2022-09-30 11:30 GMT

ఈ లక్షణాలుంటే థైరాయిడ్‌ క్యాన్సర్.. ఇది చాలా ప్రాణాంతకం..!

Thyroid Cancer: చాలా రోజులుగా గొంతులో నొప్పిగా ఉన్నా.. ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నా అది థైరాయిడ్ క్యాన్సర్‌ లక్షణం అయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. దీనికి సకాలంలో చికిత్స తీసుకుంటే పర్వాలేదు లేదంటే ప్రాణాలని హరిస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ అనేది గొంతులో వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్‌కు మ్యుటేషన్ కారణం. కణాలు చనిపోయి కణితిని ఏర్పరుస్తాయి. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది.

థైరాయిడ్ క్యాన్సర్‌లో నాలుగు రకాలు. పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా, మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా, ఫోలిక్యులర్ కార్సినోమా, అనాప్లాస్టిక్ థైరాయిడ్ కార్సినోమా. ఈ వ్యాధి నెమ్మదిగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. థైరాయిడ్ మెడలో వస్తుంది. థైరాయిడ్ అనేది అనేక ముఖ్యమైన హార్మోన్లను స్రవించే గ్రంధి. థైరాయిడ్ నుంచి విడుదలయ్యే హార్మోన్లు రక్తపోటు, బరువు, జీవక్రియ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి.

థైరాయిడ్ లక్షణాలు

థైరాయిడ్‌ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. తొలిదశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా గొంతులో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, శోషరస వాపు, బరువైన స్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చూపించాలి. థైరాయిడ్ క్యాన్సర్ చాలా సందర్భాలలో ప్రాణాంతకం కాదు. థైరాయిడ్ క్యాన్సర్‌కు సకాలంలో చికిత్స అందించినట్లయితే దానిని సులభంగా నయం చేయవచ్చు. కానీ అది మరింత పెరిగితే ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది. కాబట్టి సకాలంలో చికిత్స చేయడం అవసరం.

Tags:    

Similar News