Health Tips: వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఆరోగ్యానికి హాని..!

Health Tips: వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఆరోగ్యానికి హాని..!

Update: 2022-12-05 03:30 GMT

Health Tips: వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఆరోగ్యానికి హాని..!

Health Tips: ఈ రోజుల్లో ఫ్రిజ్‌ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఆహార పదార్థాలను చల్లగా ఉంచడమే కాకుండా ఆహారం చెడిపోకుండా చేస్తుంది. ఆహార పదార్థాలు ఏవైనా సరే పాడైపోకుండా ఉండాలంటే ఆలోచించకుండా ఫ్రిజ్‌లో పెడుతారు. అయితే కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫ్రిజ్‌లో ఏయే వస్తువులని పెట్టకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

మందులు

చాలా మందులను చల్లని ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. దీని కారణంగా ప్రజలు అన్ని మందులను ఫ్రిజ్‌లో ఉంచుతారు. దీనివల్ల కొన్ని మందులు శరీరానికి హాని కలిగిస్తాయి. డాక్టర్ సలహా లేకుండా ఇలా చేయకూడదు.

నూనె

నూనె మిగిలిందంటే దానిని ఒక గిన్నెలో పోసి ఫ్రిజ్‌లో పెడుతారు. తద్వారా ఇది చెడిపోకుండా ఉంటుంది. కానీ నూనె రుచి పోతుంది. కొన్నిసార్లు నూనె ఘనీభవిస్తుంది. ఇటువంటి నూనె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

కాఫీ

చాలా మంది కాఫీ ప్యాకెట్లను ఫ్రీజ్‌లో పెడుతారు. కాఫీని ఫ్రీజ్‌లో ఉంచడం సరికాదు. కాఫీ తేమతో కూడిన కాఫీ రుచి మారుతుంది.

అరటిపండు

చాలా మంది ఫ్రిజ్‌లో పండ్లను నిల్వ చేస్తారు. కానీ ప్రతి పండును ఫ్రిజ్‌లో ఉంచడం సరికాదు. అరటిపండ్లను ఫ్రీజ్‌లో ఉంచడం మంచిదికాదు. ఫ్రీజ్‌లో ఉంచిన అరటిపండు తినడం వల్ల జలుబు, ఫ్లూ త్వరగా వస్తాయి. ఇది గొంతు నొప్పిని కలిగిస్తుంది.

Tags:    

Similar News