Smartphone Effect: పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. మెదడు ఎదుగుదలలో లోపాలు..!

Smartphone Effect: నేటికాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌కు బానిసలు.

Update: 2022-11-26 12:37 GMT

Smartphone Effect: పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. మెదడు ఎదుగుదలలో లోపాలు..!

Smartphone Effect: నేటికాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌కు బానిసలు. ఎదిగిన పిల్లలైతే సమయం తెలియకుండా స్మార్ట్‌ఫోన్‌పైనే గడుపుతారు. కరోనా కాలం నుంచి స్మార్ట్‌ఫోన్ పిల్లలను కూడా బాగా ప్రభావితం చేసింది. పిల్లలు ఫోన్‌కి అతుక్కుపోయి ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది పిల్లల జీవితాన్ని మరుగున పడేస్తుంది. పిల్లలు మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురవుతారు.

డిప్రెషన్ సమస్య

మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల డిప్రెషన్ బారిన పడుతారు. దీంతోపాటు చిరాకు, కోపం పెరుగుతుంది. ఎందుకంటే మొబైల్ ఎక్కువగా వాడే వ్యక్తి బయటి ప్రపంచంతో సంబంధాలని పెంచుకోలేడు. ఒకవేళ ఈ అలవాటు మార్చుకునే క్రమంలో దూకుడుగా, చిరాకుగా, నిరాశ, నిస్పృహలకి లోనవుతాడు.

శారీరక ఎదుగుదలలో లోపాలు

చిన్నవయసులోనే స్మార్ట్ ఫోన్లు వాడడం వల్ల పిల్లలు సామాజికంగా ఎదగలేరు. బయట ఆడుకోలేకపోవడం వల్ల వారి వ్యక్తిత్వం అభివృద్ధి చెందదు. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండగలిగే వాతావరణం వారికి లభించదు. పిల్లలు శారీరకంగా బలహీనంగా మారుతారు.

బ్రెయిన్ ట్యూమర్

పిల్లలు ఎక్కువ మొబైల్ చూస్తుంటే ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల పిల్లలకు ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పిల్లల మెదడు కణితులకు మొబైల్ కూడా కారణం అవుతుంది.

మెదడు ఎదుగుదల లోపం

10 ఏళ్లలోపు పిల్లలు 7 గంటల కంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు వాడితే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొర సన్నగా మారి ఎదుగుదలపై చెడు ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

డ్రై ఐ సమస్య

పిల్లలు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లు పొడిబారతాయి. చిన్న వయస్సులోనే అద్దాలు వస్తాయి. వారి కళ్ల సంఖ్య పెరుగుతుంది. చాలా సార్లు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను కలిగిస్తుంది.

Tags:    

Similar News