Viral Fever: వర్షాల సీజన్‌లో వైరల్ ఫీవర్స్ రాకుండా జాగ్రత్తలు!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. వాతావరణంలో తేమ పెరిగినప్పుడు గాలిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిముల వ్యాప్తి పెరుగుతుంది. ఇది రకరకాల వైరల్ ఫీవర్లకు కారణమవుతుంది. ఈ సీజన్‌లో వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Viral Fever: వర్షాల సీజన్‌లో వైరల్ ఫీవర్స్ రాకుండా జాగ్రత్తలు!
Viral Fever: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. వాతావరణంలో తేమ పెరిగినప్పుడు గాలిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిముల వ్యాప్తి పెరుగుతుంది. ఇది రకరకాల వైరల్ ఫీవర్లకు కారణమవుతుంది. ఈ సీజన్‌లో వైరల్ ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
వర్షాకాలంలో వైరల్ జ్వరాల తాకిడి పెరుగుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్లు చాలా తరచుగా వీటి బారిన పడతారు. వైరల్ ఫీవర్స్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షణాలు ఇలా..
వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ పెరగడంతోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ముక్కు కారడం, వికారం, వాంతులు, విరేచనాలు, అలసట, కళ్లు తిరగడం.. ఇలా వైరస్ రకాన్ని బట్టి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరాలు మూడు రోజుల నుంచి రెండు వారాల వరకూ వేధించొచ్చు. పై లక్షణాల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
ట్రీట్మెంట్ ఇలా..
జ్వరం వచ్చినట్టు గమనిస్తే సొంత వైద్యానికి పోకుండా తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. మందులు వాడుతూ తగినంత రెస్ట్ తీసుకోవాలి.
జ్వరం ఉన్నన్ని రోజులు కాచి చల్లార్చిన నీటినే తాగాలి. అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
శరీరంలో వైరస్ లోడ్ త్వరగా తగ్గాలంటే డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం నిమ్మరసం, తేనె వంటివి తీసుకుంటే మంచిది.
జ్వరం ఉన్నవాళ్లు తప్పకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలి. నొప్పుల నుంచి రిలీఫ్ కోసం గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది.
జాగ్రత్తలు ఇలా..
ఈ సీజన్‌లో దోమలు, కలుషిత నీరు తాగడం ద్వారా వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిరకాల జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి. కాబట్టి జ్వరం ఉన్న వ్యక్తులు బట్టలు, తువ్వాళ్లు, ఇతర వస్తువులను విడిగా ఉంచుకోవాలి.