Health Tips: తెల్ల మచ్చలున్నవారు వీటి జోలికి అస్సలు పోకూడదు..!

Health Tips: కొంతమందికి ముఖంపై లేదా శరీరంలోని ఇతర భాగాలపై తెల్లటి మచ్చలు ఉండటం మీరు గమనించే ఉంటారు.. ఇది ఒక చర్మ వ్యాధి.

Update: 2022-10-05 16:00 GMT

Health Tips: తెల్ల మచ్చలున్నవారు వీటి జోలికి అస్సలు పోకూడదు..! (Representational image)

Health Tips: కొంతమందికి ముఖంపై లేదా శరీరంలోని ఇతర భాగాలపై తెల్లటి మచ్చలు ఉండటం మీరు గమనించే ఉంటారు. దీనిని బొల్లి అంటారు. ఇది ఒక చర్మ వ్యాధి. దీని వల్ల చర్మం రంగును కోల్పోతుంది. ఈ వ్యాధిలో ఒక వ్యక్తి చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. బొల్లి ఉంటే శరీరంలోని వెంట్రుకలు కూడా తెల్లగా మారవచ్చు. శరీరంలోని మెలనోసైట్‌లు నాశనం అయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మెలనోసైట్లు మెలనిన్ ఉత్పత్తి చేసే చర్మ కణాలు. ఇది చర్మానికి రంగు,వర్ణద్రవ్యం ఇచ్చే రసాయనం.

బొల్లి సాధారణంగా చిన్న చిన్న తెల్ల మచ్చలతో మొదలవుతుంది. ఇది చాలా నెలల వ్యవధిలో క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తుంది. బొల్లి సాధారణంగా చేతులు, కాళ్లు, ముఖం మీద ఏర్పడుతుంది. అంతేకాదు కళ్ళు, లోపలి చెవితో సహా శరీరంలోని ఏ భాగానైనా వ్యాపిస్తుంది. ఈ మచ్చల వల్ల చర్మంలోని కొన్ని ప్రాంతాలు వాటి వర్ణద్రవ్యాన్ని కోల్పోతాయి. బొల్లి ద్వారా ప్రభావితమైన చర్మం మొత్తం మారుతూ ఉంటుంది. కొంతమంది రోగులకు శరీరంపై తెల్లని మచ్చలు తక్కువగా ఉంటాయి.

తెల్లమచ్చలతో బాధపడేవారు వీటిని తినకూడదు

బొల్లితో బాధపడుతున్న రోగులకు వైద్యపరంగా గుర్తించిన ఆహారం లేనప్పటికీ అనేక అధ్యయనాలు కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలని చెబుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కొన్ని ఆహారాలకు భిన్నంగా స్పందించవచ్చు.

తినకూడని ఆహారాలు

వైన్, బ్లూబెర్రీస్, సిట్రస్ , కాఫీ, పెరుగు, చేపలు, పండ్లరసం, ఉసిరికాయ, ద్రాక్ష, ఊరగాయ, దానిమ్మ, పియర్, ఎర్రమాంసం, టమోటో, గోధుమ ఉత్పత్తులు, పుల్లని పదార్థాలు మొదలైనవి ఉంటాయి.

Tags:    

Similar News