Mumps Booming Children: తల్లిదండ్రులకు అలర్ట్‌.. పిల్లల్లో విజృంభిస్తున్న గవదబిళ్లలు.. లక్షణాలు చికిత్స తెలుసుకోండి..!

Mumps Booming Children: ఎండాకాలం వచ్చేసింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.

Update: 2024-03-14 16:00 GMT

Mumps Booming Children: తల్లిదండ్రులకు అలర్ట్‌.. పిల్లల్లో విజృంభిస్తున్న గవదబిళ్లలు.. లక్షణాలు చికిత్స తెలుసుకోండి..!

Mumps Booming Children: ఎండాకాలం వచ్చేసింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో పిల్లలకు వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తాజాగా కేరళలో పిల్లల్లో గవదబిళ్లలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మార్చి 10న ఒక్కరోజే 190 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిపట్ల అవగాహన చాలా అవసరం.ఇది ఒక అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గవదబిళ్లలు అంటే ఏమిటి..?

గవదబిళ్లు రెండు చెంపల వైపులా లాలాజలాన్ని ఉత్పత్తి చేసే పరోటిడ్ గ్రంథిని ప్రభావితం చేసే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ తుమ్మడం లేదా దగ్గడం, ముద్దులు పెట్టడం, కలుషితమైన నీటిని తాగడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణంగా పిల్లలలో ఎక్కువగా సంభవిస్తుంది కానీ ఏ వయస్సులోనైనా దీని బారిన పడే అవకాశాలు ఉంటాయి.

లక్షణాలు

1. మెడ దగ్గర వాపుతో నొప్పి

2. నమలడం కష్టమవడం

3. జ్వరం కలిగి ఉండడం

4. తలనొప్పి కలిగి ఉండడం

5. కండరాల నొప్పి ఉండడం

6. నిరంతరం అలసట అనుభూతి

7. ఆకలి వేయకపోవడం

8. పెద్దలలో వృషణాలలో నొప్పి

గవదబిళ్లల వల్ల మరణం సంభవిస్తుందా..?

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి చాలా తీవ్రంగా మారుతుంది. ఇది పిల్లలలో చెవుడు, మెదడు వాపును కలిగిస్తుంది. దీని కారణంగా రోగి చనిపోయే అవకాశాలు ఉన్నాయి.

చికిత్స ఏంటి..?

ఈ ఇన్ఫెక్షన్‌కు చికిత్స లేదు. బెడ్ రెస్ట్, హెల్తీ డైట్‌, లిక్విడ్ తీసుకోవడం వల్ల 3 నుంచి 10 రోజులలో నయమవుతుంది. ఇది జరగకపోతే రోగి లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తారు.

ఎలా రక్షించాలి..?

ఈ వ్యాధిని నివారించడానికి వ్యాధి ఉన్నవారి ఆహారాన్ని తినకూడదు నీటిని తాగకూడదు. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు ప్రజలకు దూరంగా ఉండాలి. MMR (గవదబిళ్లలు-మీజిల్స్, రుబెల్లా) వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ను 12 నుంచి 15 నెలల వయస్సు తర్వాత ఎప్పుడైనా వేయవచ్చు. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి చిన్నతనంలోనే టీకాలు వేయించడం ఉత్తమం.

Tags:    

Similar News