మస్కిటో కాయిల్స్ తో డేంజర్..

Update: 2019-08-01 07:26 GMT

వర్షాకాలం రాగానే దోమల సమస్య మొదలవుతుంది దోమల నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం మస్కిట్ క్రీమ్స్, మస్కిటో స్ప్రేలు, మస్కిటో కాయిల్స్ వాడుతుంటాం. ఇంకా ఇప్పుడు మార్కెట్లో కొన్ని ఎలక్ర్టానిక్ పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే అవే ప్రాణాపాయంగా మారుతున్నాయి మస్కిటో కాయిల్స్ వాడకంతో దోమలు చనిపోవడం అటుంచి మనుషులను జబ్బులకు గురి చేస్తున్నాయి.

దోమలు చూడటానికి చిన్నగా ఉన్నా అవి కాటేస్తే మలేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకుతాయి. అలా అని దోమల నివారణకు మార్కెట్లో వస్తున్న అనేక రకాల మస్కిటో కాయిల్స్ వాడుతుంటాం. అయితే ఇప్పుడు ఈ మస్కిటో కాయిల్స్ తో కంటి చూపు కోల్పోవడంతో పాటు అస్తమా వచ్చే ప్రమాదం ఏర్పడుతోంది.

దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకోవడంతో పాటు సాయంత్రం వేళలో ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచిస్తున్నారు వైద్యులు. దోమల నివారణకు కృత్రిమంగా తయారైన వాటిని కాకుండా సహజమైన పద్దతులు ప్రయోగించాలంటున్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు ఇంట్లోకి చల్లటి గాలీ వెలుతూరు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలంటున్నారు.

దోమల నివారణ కోసం మస్కిటో కాయిల్స్ వాడే వారు ముందుగా విషయాన్ని గ్రహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల బెడద నుంచి దూరంగా ఉండటం మంచిది. ఈ విషయంలో వీలైనంత వరకూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Full View 

Tags:    

Similar News