Monsoon Alert: వర్షాకాలంలో పాములు, పురుగుల నుంచి రక్షించుకునే గోల్డెన్ టిప్స్
Monsoon Alert: వర్షాకాలంలో పాములు, పురుగుల నుంచి రక్షించుకునే గోల్డెన్ టిప్స్
వానాకాలం అంటే అందరికీ ఇష్టం—చల్లని వాతావరణం, హాయిగా గాలి వీచే రోజులు. అయితే ఈ సీజన్‌లో ఆరోగ్య సమస్యలతో పాటు పాములు, విషపూరిత పురుగులు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తోటల దగ్గర ఇళ్లు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది సాధారణ సమస్య. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే పాములు, పురుగులు ఇంట్లోకి రావడం నివారించవచ్చు.
మీ ఇల్లు తోట, అడవి లేదా కొండ ప్రాంతాల దగ్గర ఉంటే తలుపులు, కిటికీలు ఎప్పుడూ బిగిగా మూసి ఉంచండి. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పాములు తలుపుల గ్యాప్‌ల ద్వారా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది.
వేపనూనె స్ప్రే: కొద్దిగా వేపనూనెను నీటిలో కలిపి ఇంటి చుట్టూ ప్రతిరోజూ స్ప్రే చేయండి. ఇది పురుగులు, పాములను దూరంగా ఉంచుతుంది. తోటల్లో, నీరు నిల్వ ఉండే చోట్ల కూడా ఈ మిశ్రమాన్ని చల్లవచ్చు.
బ్లీచింగ్ పౌడర్: ఇంటి బయట నీరు నిలిచే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లండి. ఇది చల్లదనాన్ని తగ్గించడమే కాకుండా పాములు, హానికర పురుగులు దరిచేరకుండా కాపాడుతుంది.
మసాలా ద్రావణం: దాల్చినచెక్క పొడి, వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపిన ద్రావణాన్ని ఇంటి బయట చల్లితే వాటి ఘాటు వాసన పాములను దూరంగా ఉంచుతుంది.
ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్: ఉల్లిపాయ, వెల్లుల్లిని పేస్ట్ చేసి తలుపులు, కిటికీల చుట్టూ రాస్తే పాములు లోపలికి రావడం మానేస్తాయి. ఇది ఒక సహజమైన చిట్కా.
పాములను దూరం చేసే మొక్కలు: కలబంద, స్నేక్ ప్లాంట్, తులసి, నిమ్మగడ్డి వంటి మొక్కలను ఇంటి గుమ్మం దగ్గర, కిటికీల పక్కన నాటండి. వీటి వాసన పాములకు నచ్చదు కాబట్టి అవి ఇంటికి రాకుండా ఉంటాయి.
ఈ సహజమైన చిట్కాలు తక్కువ ఖర్చుతో పాటించదగినవే కాకుండా, పాములు, పురుగుల వంటి ప్రమాదకర జంతువుల నుంచి రక్షణ ఇస్తాయి. వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ సులభమైన పద్ధతులను పాటించడం మంచిది.