Merry Christmas 2025: మీ ఆత్మీయులకు ఈ 'బైబిల్' వాక్యాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేయండి!

క్రిస్మస్ 2025 వేడుకల కోసం మీ ఆత్మీయులకు పంపడానికి ఉత్తమ బైబిల్ కోట్స్ మరియు శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి. ఈ సందేశాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపండి.

Update: 2025-12-22 13:09 GMT

చలికాలం మంచు కురుస్తున్న వేళ.. ఆకాశంలో నక్షత్రాలు వెలుగులీనుతుంటే.. లోక రక్షకుడు యేసు క్రీస్తు జన్మించిన శుభదినం రానే వచ్చింది. డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులకే కాదు, సర్వ మానవాళికి ప్రేమ మరియు శాంతి సందేశాన్ని అందిస్తుంది.

ఈ పండుగ వేళ మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పంపడానికి కొన్ని పవిత్రమైన బైబిల్ కోట్స్ మరియు మనసును హత్తుకునే శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి.

బైబిల్ వాక్యాలతో కూడిన క్రిస్మస్ శుభాకాంక్షలు:

  • ధైర్యాన్ని ఇచ్చే వాక్యం: "నీవు భయపడకుము నేను నీకు తోడైయున్నాను.. దిగులు పడకుము నేను నీ దేవుడనై యున్నాను." — మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ 2025 శుభాకాంక్షలు!
  • ఆపత్కాలంలో తోడుగా: "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు.. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు." — హ్యాపీ క్రిస్మస్!
  • దేవుని కాపలా: "యెహోవా నా కాపరి.. నాకు లేమి కలుగదు." — మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
  • ప్రశాంతత కోసం: "దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి." — మెర్రీ క్రిస్మస్ 2025!
  • విశ్వాసంతో: "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము." — అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
  • శుద్ధ హృదయం: "హృదయ శుద్ధి గల వారు ధన్యులు.. వారు దేవుని చూచెదరు." — మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు.
  • దేవుని ఆలోచన: "నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన ఆలోచనలు సమాధానకరమైన ఆలోచనలే గాని కీడు చేయు ఆలోచనలు కావు." — హ్యాపీ క్రిస్మస్!

 

 

క్రిస్మస్ సందేశం:

యేసు క్రీస్తు పుట్టుక మనకు శాంతిని, కరుణను నేర్పిస్తుంది. ద్వేషాన్ని వీడి ప్రేమతో మెలగడమే ఈ పండుగ అసలైన పరమార్థం. ఈ క్రిస్మస్ మీ ఇంట సంతోషాల వెలుగులు నింపాలని మనసారా కోరుకుందాం.

Tags:    

Similar News