పెసరపప్పు, జీలకర్ర, అల్లం మిశ్రమంతో బెల్లీ ఫ్యాట్‌కి గుడ్‌బై చెప్పండి! ముందుకొచ్చిన పొట్టను కరిగించాలంటే ఇలా చేయండి
ఈ రోజుల్లో అధిక బరువు, ప్రత్యేకించి బెల్లీ ఫ్యాట్ సమస్య చాలామందిని వేధిస్తోంది. పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు కేవలం శరీర ఆకృతిని మాత్రమే కాదండీ..
ఈ రోజుల్లో అధిక బరువు, ప్రత్యేకించి బెల్లీ ఫ్యాట్ సమస్య చాలామందిని వేధిస్తోంది. పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు కేవలం శరీర ఆకృతిని మాత్రమే కాదండీ.. ఆరోగ్యాన్ని కూడా బాగా ప్రభావితం చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందుకే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడం అవసరం. దీన్ని తగ్గించేందుకు జిమ్‌కు వెళ్లడం, కఠిన డైట్లకు పాల్పడడం కాకుండా ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో సులభంగా సమస్యను అధిగమించవచ్చు.
ఇలాంటిదే ఈ చిట్కా – పెసరపప్పు, జీలకర్ర, అల్లంతో తయారు చేసే సులభమైన నీరు. ఇది బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడడమే కాకుండా, శరీరానికి అనేక లాభాలను ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి, ఎప్పుడు తాగాలి, దాని వల్ల లాభాలేంటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అవసరమైన పదార్థాలు:
పెసరపప్పు – 1 కప్పు
నీరు – 3 నుంచి 4 కప్పులు
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం – కొద్దిగా తురిమినది
ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టాలి.
తర్వాత ప్రెజర్ కుక్కర్‌లో వేసి 3-4 కప్పుల నీరు కలిపి 3-4 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి.
ఉడికిన తర్వాత పప్పును వడకట్టి నీటిని వేరు చేయాలి.
దానిలో జీలకర్ర, తురిమిన అల్లం, ఉప్పు వేసి కొద్దిగా మరిగించాలి.
చివరగా ఫిల్టర్ చేసి వేడివేడిగా లేదా సన్నని ఉష్ణోగ్రతలో తాగవచ్చు.
ఎప్పుడు తాగాలి?
ఉదయం ఖాళీ కడుపుతో: శరీర శుద్ధికి, జీవక్రియ పెంచేందుకు ఇది బెస్ట్ టైమ్.
తినే ముందు: ఆకలిని నియంత్రించడంతోపాటు అధిక కేలరీలు తీసుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది.
రాత్రి భోజనం తర్వాత: జీర్ణక్రియ మెరుగవడంతోపాటు శరీరానికి తేలికగా ఉంటుంది.
పెసరపప్పు నీటి ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థకు బలం: ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నివారిస్తుంది.
తక్కువ కేలరీలు, అధిక పోషకాలు: ఇది ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉండి శరీరానికి అవసరమైన పుష్టిని అందిస్తుంది.
నిర్విషీకరణ (డీటాక్స్): శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
జీవక్రియ వేగవంతం: ప్రోటీన్, ఫైబర్ జీవక్రియను యాక్టివ్ చేసి శరీరంలో ఫ్యాట్ బర్నింగ్‌కి బూస్ట్ ఇస్తుంది.
మరిన్ని ముఖ్యమైన సూచనలు:
ఈ నీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించాలి.
రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి.
నిద్రను పట్టించుకుని రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి.
జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి.
గమనిక:
ఈ చిట్కా సాధారణ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. దీన్ని పాటించేముందు మీ వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరి శరీర పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి, వ్యక్తిగత అవసరాలను బట్టి మార్పులు అవసరమవచ్చు.