Health Tips: ఈ పండ్లని పొట్టు తీసి తింటే పొరపాటే.. పోషకాలు శూన్యం..!

Health Tips:ఈ పండ్లని పొట్టు తీసి తింటే పొరపాటే.. పోషకాలు శూన్యం..!

Update: 2022-12-05 06:24 GMT

Health Tips: ఈ పండ్లని పొట్టు తీసి తింటే పొరపాటే.. పోషకాలు శూన్యం..!

Health Tips: పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. పండ్లు తినడం ఎంత అవసరమో వాటిని సరైన విధంగా తినడం కూడా అంతే ముఖ్యం. పండ్లను తప్పుగా తింటే పూర్తి పోషకాహారం లభించదు. కొందరు పండ్లను పొట్టు తీసి తింటారు. బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లకు ఇది మంచిదే కానీ కానీ కొన్ని పండ్ల తొక్కలలో పోషకాహారం దాగి ఉంటుంది. అలాంటి పండ్ల తొక్కను తొలగిస్తే పొరపాటు చేసినట్లే. వాటి గురించి తెలుసుకుందాం.

కివి

కివి చాలా ఆరోగ్యకరమైన పండు. దీని తొక్క కూడా చాలా మేలు చేస్తుంది. కివి పై తొక్క గట్టిగా ఉంటుంది. దీని కారణంగా చాలా మంది దానిని తీసివేస్తారు. విటమిన్లు, అనేక ఖనిజాలు దీని పై తొక్కలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

సపోట

చాలామంది సపోట పండ్లని పొట్టు తీసి తినడానికి ఇష్టపడతారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. ఎందుకంటే సపోట తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులని తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

పియర్

పియర్‌ పండ్లని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీనిని పొట్టుతో సహా తినాలి. పియర్ తొక్కలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పియర్ పీల్ గుండెకు మేలు చేస్తుంది.

ఆపిల్

యాపిల్‌ని దాదాపు ప్రతి ఒక్కరు తింటారు. యాపిల్ పండు తొక్క తీసి తినడానికి చాలా మంది ఇష్టపడతారు కానీ అలా చేయడం సరికాదు. యాపిల్ తొక్కలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాపిల్ తొక్క గుండెకు మేలు చేస్తుంది.

Tags:    

Similar News