Ice Cream: వర్షంలో ఐస్‌క్రీం తినే అలవాటు ఉందా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వేసవిలో చల్లని ఐస్‌క్రీం తినడం సాధారణమే, దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు రావు. అయితే, చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీం తినడం అలవాటు చేసుకుంటారు.
Ice Cream: వర్షంలో ఐస్‌క్రీం తినే అలవాటు ఉందా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వేసవిలో చల్లని ఐస్‌క్రీం తినడం సాధారణమే, దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు రావు. అయితే, చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీం తినడం అలవాటు చేసుకుంటారు. వర్షంలో చల్లని వాతావరణంలో ఐస్‌క్రీం తినడం శరీరానికి మంచిదేనా? ఆరోగ్యంపై దాని ప్రభావం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
జలుబు, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం
వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా వేడి ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చల్లని ఆహారాలు, ముఖ్యంగా ఐస్‌క్రీం తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ బిగుసుకుపోవడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు కూడా అవకాశం ఉంటుంది.
ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం
ఐస్‌క్రీంలో అధిక చక్కెర, కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతుంది.
జీర్ణవ్యవస్థపై ప్రభావం
వర్షాకాలంలో ఐస్‌క్రీం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. గొంతు నొప్పి, తలనొప్పి, దంత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు, చల్లని ఐస్‌క్రీం మెదడు నరాలపై ప్రభావం చూపి తలనొప్పిని కూడా కలిగించవచ్చు.
తీసుకోవాలా వద్దా?
మీకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టమైనా, వర్షాకాలంలో దాన్ని తినకపోవడమే ఉత్తమం. ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవాలంటే ఈ కాలంలో వేడి ఆహారాలకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.