'బావున్నాను' అని చెప్పినంత మాత్రాన బావున్నట్లేనా?

Update: 2019-05-27 04:38 GMT

సౌమ్య ఇంటి నుంచి అప్పుడే ఆఫీస్‌కు వచ్చింది.. హడావుడిగా తన సీటు దగ్గరకు వెళుతూ..ఆమెకు తన సహచారి రమ్య కనిపించడంతో తనను మెుక్కుబడిగా పలికరించి వెళ్ళి తన స్థానంలో కూర్చొంది. సౌమ్య పలికరింపుల్లో ఏదో తేడా కనిపించడంతో కూర్చున్న సీటు దగ్గరకు వెళ్ళిన రమ్య తనను అప్యాయంగా పలకిచింది. తనలో కనిపించిన ఆందోళన ఏంటో కారణం ఏంటో తెలుసుకుంది. తర్వాత దైర్యం చెప్పింది. ఇలా చాలా మంది పలకరింపులు, పరామర్శల్లో ఎక్కువభాగం మొక్కుబడిగానే ఉంటాయి. వాటికి ప్రతిగా వచ్చే ప్రతిస్పందనలు దాదాపు అవిధంగానే ఉంటాయి. "హలో హౌ అర్ యూ" అనే మాట ఎంత యాథృచ్చంగా వస్తుందో.. అవతలి వక్తి నుంచి "యా ఐయామ్ ఫైన్" అనే మాట కూడా అంతే అలవోకగా వచ్చేస్తుంది. పైకి బాగున్నానని చెప్పినంత మాత్రనా తాను బావున్నట్లేనా? పైకి అవతలి వ్యక్తి బాగునట్లుగా కనిపిస్తున్నా వారిలో లోపల అగ్ని పర్వతం బద్దలై లావా ప్రవహిస్తున్న కానీ వారు మాత్రం పైకి బాగున్నానే చెబుతారు. కానీ వాస్తవంగా వాళ్లు మాత్రం ఆసౌఖర్యంగానే ఉంటారు .

పలకరించకపోతే బావుండదని ఏదో మాట వరసగా బాగున్నారా అని అడగడం.. అడిగారు కదా అని వీళ్లేదో బదులివ్వడం. ముఖంలో చిరుహాసం కనిపిస్తున్నమనుసులో బాధ ఉంటుంది. వారిలో మనసులో ఉన్న బాధను బయటపెట్టేవాళ్లు చేప్పే వాళ్ళు చాలా అరుదు. తన వ్యథను అవతలివారికి చెప్పినా ఒరిగేదేముంది? అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఎదుటివారి పలకరింపుల్లో నిజాయితీ కనిపించినప్పుడు వారికున్న బాధలు వారికి చెప్పడానికి సిద్దపడుతారు. పరామర్శించే వాళ్లు 'బావున్నారా?' అనే మాటను ఏదో ఆనవాయితీగా కాకుండా తన సమస్యకు మీనుంచి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అనేలా మీ పలకరింపు ఉండాలి. మనసుకు తాకేలా మాట్లాడితే, వాళ్లు తమ కష్టాలు చెబుతారు. సాయం తీసుకోవడంలో వారికి ఉన్న మొహమాటం తొలగిపోతుంది. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయత బలపడేలా చేసుకోవాలి. అప్పుడే ఎదుటివాళ్లు వాస్తవాల్ని బయటపెడతారు. ఆత్మీయ పలకరింపు చిరు పరిచయాన్ని స్నేహంగా మార్చేలా చేస్తుంది. నూరేళ్ల జీవితం ప్రతి ఒక్కరికీ ఒక వరమైతే అందులో మనకు దొరికే పరిచయాలు అంతకుమించిన వరం. కాబట్టి మీ పలకరింపు అందరిలా కాకుండా అప్యాయంగా ఉండేలా చూసుకోండి.  

Similar News