Multi Vitamins: మల్టీవిటమిన్లతో కూడా ముప్పుందా?

ప్రస్తుత కాలంలో చిన్న విషయానికి కూడా మందులు వాడటం అనేది కామన్ అయిపోయింది.

Update: 2025-06-28 11:15 GMT

Multi Vitamins: మల్టీవిటమిన్లతో కూడా ముప్పుందా?

Multi Vitamins: ప్రస్తుత కాలంలో చిన్న విషయానికి కూడా మందులు వాడటం అనేది కామన్ అయిపోయింది. ఆరోగ్య సమస్య రాక ముందే జాగ్రత్త పడటం అంటే సమస్య రాకుండా చూసుకోవటం అన్న విషయం మరచిపోయి మెడిసిన్ ముందుగా వాడేసి తగ్గించుకోవాలనే ధోరణి పెరిగిపోయింది. ఇక బలాన్ని ఇచ్చే సప్లిమెంట్స్, మల్టీ విటమిన్ల విషయం చెప్పనే అక్కల్లెద్దు. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, వ్యాధుల బారిన పడమని అనుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం అద్భుతంగా మెరుగు పడిపోతుంది అనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. అంతేగాదు రోజు వీటిని వినియోగించే వారికే మరింత ప్రమాదం ఉందంటున్నారు.

నిజానికి మన శరీరానికి విటమిన్లు అవసరం. అయితే మల్టీవిటమిన్లు ఆహారం నుండి పొందిన పోషణను భర్తీ చేయలేవన్నది నిజం.కానీ పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేసి మల్టీవిటమిన్లపై ఆధారపడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే విటమిన్‌ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్ల టాబ్లెట్స్వాఅవసరానికమించి డితే అవి శరీరంలో పేరుకుపోయి విషపూరితం కావచ్చు. అలాగే ఐరన్‌, జింక్‌ వంటివి ఎక్కువైతే వికారం, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలను కలిగిస్తాయి. కొన్ని విటమిన్లు, మినరల్స్‌.. వేరే మెడికేషన్‌తో రియాక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన శరీరంలో ఏదైనా విటమిన్‌ స్థాయి ఎక్కువగా ఉంటే.. అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు విటమిన్‌ E ఎక్కువైతే.. రక్తం గడ్డకట్టడంలో సమస్య ఏర్పడుతుంది. ఒక పోషకాన్ని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల.. కొన్నిసార్లు ఇతర పోషకాల అసమతుల్యతకు దారితీస్తుంది. ఉదాహరణకు కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల మెగ్నీషియం సమతుల్యత దెబ్బతింటుంది. మల్టీవిటమిన్‌లను అధికంగా తీసుకుంటే అది మూత్రపిండాలు, కాలేయం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

అందుకే మల్టీ విటమిన్లను తీసుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని, సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్‌ని పరిమితం చేస్తూనే మైక్రోన్యూట్రిషియంట్స్‌ని, పీచు పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News