రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజువారీ ఆహారంలో విత్తనాలు, గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటిని నానబెట్టి తినడం, ఆ నీటిని తాగడం వల్ల మరింత పోషక విలువలు అందుతాయి.

Update: 2025-07-23 15:16 GMT

రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజువారీ ఆహారంలో విత్తనాలు, గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటిని నానబెట్టి తినడం, ఆ నీటిని తాగడం వల్ల మరింత పోషక విలువలు అందుతాయి. మెంతులు కూడా అలాంటి అద్భుతమైన విత్తనాల్లో ఒకటి. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే ఆ నీటితో పాటు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మెంతుల నీటి అద్భుత లాభాలు

జీర్ణక్రియకు మేలు – మెంతుల నీరు మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

రక్త చక్కెర నియంత్రణ – మధుమేహం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి మెంతుల నీరు ఎంతో ఉపయోగకరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్తిరంగా ఉంచడంలో దోహదం చేస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం – మెంతుల నీరు ఆకలిని అణచివేసి, జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి, బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు – క్రమం తప్పకుండా మెంతుల నీరు తాగడం ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

హార్మోన్ల సమతుల్యత – మెంతుల నీటిలో ఉన్న ఫైటోఈస్ట్రోజెన్స్ హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఇది ప్రయోజనకరం.

ఆర్థరైటిస్, ఇన్‌ఫ్లమేషన్ సమస్యలకు ఉపశమనం – మెంతుల నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఆర్థరైటిస్, ఆస్తమా వంటి ఇన్‌ఫ్లమేషన్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి మేలు – ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, చర్మాన్ని నిగారించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఇందులోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యల కోసం వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News