బెడ్‌పై పడుకుని రాత్రంతా సిరీస్‌లు చూస్తున్నారా? ఈ ఒక్క అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా

రాత్రి పొద్దుపోయే వరకు సిరీస్‌లు, సినిమాలు చూడటం చాలా మందికి అలవాటైపోయింది. బింజ్ వాచ్ పేరుతో ఎలా కూర్చున్నా, పడుకున్నా సరే… ఒకేసారి గంటల తరబడి చూస్తున్నారు.

Update: 2025-07-17 15:00 GMT

బెడ్‌పై పడుకుని రాత్రంతా సిరీస్‌లు చూస్తున్నారా? ఈ ఒక్క అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా

రాత్రి పొద్దుపోయే వరకు సిరీస్‌లు, సినిమాలు చూడటం చాలా మందికి అలవాటైపోయింది. బింజ్ వాచ్ పేరుతో ఎలా కూర్చున్నా, పడుకున్నా సరే… ఒకేసారి గంటల తరబడి చూస్తున్నారు. ముఖ్యంగా బెడ్‌పై పడుకుని, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రాత్రంతా సినిమాలు, సిరీస్‌లు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో ఇది సరదాగా అనిపించినా, వైద్య నిపుణుల ప్రకారం ఈ ఒక్క అలవాటు ఆరోగ్యానికి తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతోంది.

ఓటిటీలలో కొత్త సిరీస్‌లు వస్తే ఆఫీసులో, స్నేహితుల మధ్య చర్చ మొదలవుతుంది. “చూసావా ఆ సిరీస్? భలే ఉంది” అంటూ ఎవరో చెబితే ఆ రాత్రే కూర్చుని మొత్తం ఎపిసోడ్స్ పూర్తి చేసేస్తారు. అంతేకాదు, షార్ట్స్, రీల్స్ స్క్రోలింగ్ కూడా ఆగదు. ఒక్కసారి ఫోన్ పట్టుకుంటే నిమిషాలు ఎలా గంటలవుతాయో కూడా తెలియదు.

ఎప్పుడో ఒకసారి ఇలా చూడటం పెద్ద సమస్య కాకపోయినా, ఇది అలవాటుగా మారితే మాత్రం శరీరానికి, మానసిక ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్ల సమస్యలు, మెడ నొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, ఒబేసిటీ వంటి అనేక సమస్యలకు ఈ బింజ్ వాచ్ అలవాటు కారణమవుతోందని చెబుతున్నారు.

Tags:    

Similar News