Besan for Pigmentation: శనగపిండి పిగ్మెంటేషన్‌కి నిజంగానే ఉపశమనం ఇస్తుందా..? నిజాలు ఇవే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్మ సంరక్షణకు సంబంధించిన అనేక చిట్కాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌లో, శనగపిండితో పిగ్మెంటేషన్‌ను పూర్తిగా తొలగించవచ్చని పేర్కొనడంతో చాలామంది ఆ సలహాను అనుసరిస్తున్నారు.
Besan for Pigmentation: శనగపిండి పిగ్మెంటేషన్‌కి నిజంగానే ఉపశమనం ఇస్తుందా..? నిజాలు ఇవే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్మ సంరక్షణకు సంబంధించిన అనేక చిట్కాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌లో, శనగపిండితో పిగ్మెంటేషన్‌ను పూర్తిగా తొలగించవచ్చని పేర్కొనడంతో చాలామంది ఆ సలహాను అనుసరిస్తున్నారు. కానీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాంటి చిట్కాలను ఆలోచించకుండా అనుసరించడం వల్ల అలెర్జీలు, చికాకు, మచ్చలు మరింత పెరగడం, చర్మానికి సహజ రక్షణ పొర దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఒక రీల్‌లో ఓ మహిళ, ఇంట్లోనే శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ముఖంపై ఉన్న మచ్చలు, నల్లటి మచ్చలు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొంది. కానీ చర్మ నిపుణుల ప్రకారం, శనగపిండిలో తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, తాజాగా కనిపించేలా చేయగలదు. కానీ పిగ్మెంటేషన్ వంటి లోతైన చర్మ సమస్యలను పూర్తిగా తొలగించలేదని వారు స్పష్టం చేస్తున్నారు.
పిగ్మెంటేషన్‌కి హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మి ప్రభావం, మెలనిన్ అసమతుల్యత, వాపు లేదా చర్మ సంబంధిత రుగ్మతలు ప్రధాన కారణాలు కావచ్చు. అందువల్ల శనగపిండి వంటి గృహచిట్కాలు చర్మాన్ని కేవలం స్వల్పంగా మాత్రమే ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, కానీ లోతైన సమస్యలపై ప్రభావం చూపవు. చర్మ సమస్యలు ఉంటే నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.