కొబ్బరిపాలతో ఇన్ని ప్రయోజనాలా..!

Update: 2019-09-13 05:34 GMT

కొబ్బరిపాల వల్ల చాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరిపాలను.. కొబ్బరికాయలోని తెల్లటి గుజ్జును తురమడం ద్వారా తయారీ చేస్తారు. కొబ్బరిపాలు.. జుట్టుకు లాభదాయకమైన పోషకాలను మరియు విటమిన్లు అందిస్తుంది. కొబ్బరి పాలలో ఉన్న పోషకాలు జుట్టు యొక్క పెరుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుంది. హెయిర్ పెరగడానికి.. తలమీద కొబ్బరి పాలతో మసాజ్ చేసి, ఒక 10 నిమిషాలు అలానే వదిలివేయాలి. ఆ తర్వాత ఒక తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే జుట్టు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణలు.

కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల కలిగే మరొక గొప్ప ప్రయోజనం ఇది. జుట్టు యొక్క అకాలంగా నెరవడాన్ని సమర్థవంతంగా నిరోధించవచ్చు. అద్భుతమైన ఫలితాల కోసం ఒక వారంలో రెండుసార్లు దాన్ని ఉపయోగించండి. ఒక టీ స్పూన్ కొబ్బరి పాలను, నిమ్మరసమును మరియు కొబ్బరినూనెల మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. తలపై మరియు వెంట్రుకలపై మర్దన చేసిన 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే జుట్టు నెరవడాన్ని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొబ్బరిపాలను వారంలో రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రెండు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను, ఒక గుడ్డు తెల్లన్ని సొనతో బాగా మిక్స్ చేసి, మరియు తలపై ఆ మిశ్రమాన్ని అప్లై చేయ్యాలి. నీటితో శుభ్రం చేయడానికి ముందు, 20 నిమిషాల పాటు అలానే ఆరబెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Tags:    

Similar News