Beauty Care Tips: నెయిల్ పాలిష్ వాడకం జాగ్రత్త..! గోళ్ల ఆరోగ్యానికి ఎందుకు హానికరమో తెలుసా?
గోళ్లను అందంగా, మెరిసేలా చూపించడానికి చాలామంది మహిళలు రోజూ నెయిల్ పాలిష్ వాడుతుంటారు. పొడవైన, పాలిష్ చేసిన గోర్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ నిపుణుల ప్రకారం నిరంతరం నెయిల్ పాలిష్ వాడటం గోళ్ల ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.

ఎందుకు హానికరం?
పసుపు రంగులోకి మారడం – తరచూ నెయిల్ పాలిష్ వాడటం వల్ల గోర్లు పసుపు రంగులోకి మారవచ్చు.
UV కిరణాల ప్రభావం – జెల్ నెయిల్ పాలిష్ ఆరబెట్టడానికి ఉపయోగించే UV లైట్లు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
గోళ్ల బలహీనత – కెమికల్ రిమూవర్లను ఎక్కువగా వాడటం వల్ల గోళ్లు ఎండిపోయి పగుళ్లు ఏర్పడతాయి. దీని వలన బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది.
సురక్షితంగా ఎలా వాడాలి?
నెలల తరబడి నెయిల్ పాలిష్ ఉంచకండి.
జెల్ లేదా పౌడర్ డిప్ పాలిష్‌ను ఇంట్లో తీయకండి; మానిక్యూరిస్ట్ సాయం తీసుకోండి.
UV లైట్లకు బదులుగా LED లైట్లు వాడే సెలూన్లను ఎంచుకోండి.
ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నెయిల్ పాలిష్ వేసుకోండి, తక్కువ రసాయనాలు ఉన్నవాటినే ఉపయోగించండి.
జెల్ నెయిల్ పాలిష్ వేసుకునే ముందు చేతులకు సన్‌స్క్రీన్ అప్లై చేయండి, ఇది చర్మాన్ని రక్షిస్తుంది.
నిపుణుల సలహా
అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం పెద్ద సమస్య కాదు. అయితే గోళ్లను సహజంగానే ఉంచడం ఎల్లప్పుడూ ఉత్తమం.