Health Tips: కాళ్లు, చేతులు తిమ్మిర్లకి గురవుతున్నాయా.. ఈ విటమిన్ల లోపమే కారణం..!

Health Tips: మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే అనేక రకాల పోషకాలు అవసరం.

Update: 2023-01-25 08:50 GMT

Health Tips: కాళ్లు, చేతులు తిమ్మిర్లకి గురవుతున్నాయా.. ఈ విటమిన్ల లోపమే కారణం..!

Health Tips: మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే అనేక రకాల పోషకాలు అవసరం. ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, కార్బోహైడ్రేట్లు వంటి అనేక పోషకాలు అవసరం. వీటన్నిటి పనితీరు వల్ల శరీరం మెరుగ్గా పని చేస్తుంది. వీటిలో ఏదైనా లోపం ఉంటే శరీరం కొన్ని సంకేతాలని అందిస్తుంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లకి గురవుతుంటే శరీరంలో విటమిన్ల లోపం ఉందని అర్థం. దీంతోపాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రాత్రిపూట తిమ్మిర్లు

కొన్నిసార్లు రాత్రిపూట ఒకవైపు నిద్రపోవడం వల్ల చేతి తిమ్మిరికి గురవుతుంది. రక్త సరఫరాలో అవరోధం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మీరు మీ మరోవైపునకి తిరిగి పడుకోవాలి. ఉపశమనం లభించనప్పుడు తిమ్మిరికి గురైన చేతిని మరొక చేతితో గట్టిగా రుద్దాలి. దీనివల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ వ్యాధి ఉన్న వ్యక్తులు తరచుగా చేతులు, కాళ్ళలో తిమ్మిర్ల సమస్యని ఎదుర్కొంటారు. ఇది అధిక రక్తపోటు లేదా టీబీ వ్యాధిలో కూడా జరుగుతుంది. ఏదైనా జబ్బుకి మందులు వేసుకుంటున్నట్లయితే దాని దుష్ప్రభావాల వల్ల తిమ్మిర్లు సంభవిస్తాయి. కాళ్లలో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

పాము కాటు

ఒక వ్యక్తిని పాము లేదా మరేదైనా విషపూరితమైన కీటకం కాటువేసినప్పుడు అతని పాదాలు తిమ్మిరికి గురవుతాయి. ఈ పరిస్థితిలో రిస్క్ తీసుకోకూడదు వెంటనే వైద్యుడి వద్దకి తీసుకెళ్లాలి. అతిగా మద్యం తాగేవారు కూడా చేతులు, కాళ్లలో తిమ్మిర్ల సమస్యని ఎదుర్కొంటారు. దీనికి కారణం వారిలో విటమిన్-బి12, ఫోలేట్ లోపం ఉంటుంది. ఈ మద్యపాన అలవాటును అరికట్టకపోతే వ్యాధి మరింత తీవ్రమవుతుంది.

ఈ విటమిన్లు లోపం

శరీరంలోని నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి శరీరంలో విటమిన్ బి, ఈ ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండు విటమిన్ల లోపం ఉంటే అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిర్ల సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా చేతులు కాళ్ళు క్రమంగా పనిచేయడం మానేస్తాయి. దీని నివారణకు పచ్చి కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పులు, సీజనల్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.



 


Tags:    

Similar News