Health Tips: 30 ఏళ్లు దాటినవారికి అలర్ట్‌.. ఇవి తగ్గించకపోతే తొందరగా వృద్ధాప్యం..!

Health Tips: ఒక వయస్సు తర్వాత కొన్ని ఆహారాలని ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యం తొందరగా వస్తుంది

Update: 2023-01-31 14:30 GMT

Health Tips: 30 ఏళ్లు దాటినవారికి అలర్ట్‌.. ఇవి తగ్గించకపోతే తొందరగా వృద్ధాప్యం..!

Health Tips: ఒక వయస్సు తర్వాత కొన్ని ఆహారాలని ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యం తొందరగా వస్తుంది. అందుకే 30 ఏళ్లు పైబడిన వారు కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఎక్కువ తీసుకుంటే అది శరీరానికి హాని కలిగిస్తుంది. ఈ వయస్సులో శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. మీరు తీసుకునే ఆహారం, పానీయాలు మిమ్మల్ని వేగంగా వృద్ధాప్యం వైపు తీసుకువెళుతాయి. అందుకే ఆహారాన్ని మరింత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.

బీరు తగ్గించండి

యువకులు సాధారణంగా బీర్ ఎక్కువగా తాగుతారు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. ఎందుకంటే బీర్ మీ శరీరంలోని కొవ్వును పెంచుతుంది. కొవ్వు పెరిగినప్పుడు అది అనేక వ్యాధులను ఆహ్వానిస్తుంది. దీని కారణంగా క్రమంగా శరీరం అన్‌ఫిట్‌ అవుతుంది.

స్వీట్లకు దూరం

మీరు స్వీట్లను ఇష్టపడితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్వీట్లతో ఊబకాయం పెరుగుతుంది. 30 సంవత్సరాలు దాటాయంటే ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీలైతే స్వీట్లు తిన్న తర్వాత కొంత సమయం వరకు నీరు తాగకుండా ఉండండి. ఆహారం తిన్న తర్వాత స్వీట్లను ఇష్టపడితే స్వీట్లకు బదులు బెల్లం తినండి. తీపి అంటే స్వీట్లు మాత్రమే కాదు. స్వీట్‌లో తీపి పెరుగు, బిస్కెట్లు, కెచప్ మొదలైనవి కూడా ఉంటాయి. ఐస్ కాఫీ కూడా శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండండి.

అధిక ఉప్పు వద్దు

మీరు ఎక్కువ ఉప్పు లేదా కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడితే 30 ఏళ్ల వయస్సు తర్వాత దీనికి దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు చుట్టుముడతాయి. ఇది ఎముకలను అలాగే అనేక ఇతర వస్తువులను దెబ్బతీస్తుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. హైబీపీ ఉన్నవారు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఆహారంలో ఉప్పు అస్సలు కలపకూడదు.

Tags:    

Similar News