Holi Mocktails: హోలీ స్పెషల్.. రంగుల పండుగ కోసం 5 అదిరిపోయే రిఫ్రెషింగ్ డ్రింక్స్! సింపుల్‌గా ఇలా చేసుకోండి..

Holi Mocktails: రంగుల సంబరాల్లో కూల్ ఫీలింగ్ కోసం.. ఇంట్లోనే చేసుకునే హోలీ స్పెషల్ హెల్తీ మాక్‌టెయిల్స్!

Update: 2026-02-28 11:30 GMT

Holi Mocktails: హోలీ స్పెషల్.. రంగుల పండుగ కోసం 5 అదిరిపోయే రిఫ్రెషింగ్ డ్రింక్స్! సింపుల్‌గా ఇలా చేసుకోండి..

హోలీ పండుగంటేనే రంగులు, అల్లరి, ఆనందం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా హోలీ జరుపుకుంటే వచ్చే ఆనందం వేరు. రంగులతో ఆడుకున్నాక అలసటగా ఉన్నప్పుడు, స్నేహితులతో కలిసి కొన్ని న్యాచురల్ డ్రింక్స్ తాగితే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. వాటిని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. వర్జిన్ పినా కోలాడా (Virgin Piña Colada)

ఎండలో హోలీ ఆడాక, ఇది తాగితే హాయిగా అనిపిస్తుంది. దీనికి కావాల్సినవి ఏంటంటే..

1 కప్పు గడ్డకట్టిన పైనాపిల్ ముక్కలు

½ కప్పు పైనాపిల్ రసం

½ కప్పు కొబ్బరి క్రీమ్

తయారీ విధానం: పైనాపిల్, రసం, కొబ్బరి క్రీమ్ కలిపి బ్లెండర్‌లో బాగా మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. గ్లాసులో పోసి పైనాపిల్ ముక్కతో అలంకరించండి. సింపుల్ మీ డ్రింక్ రెడీ అవుతుంది.

2. పుదీనా & నిమ్మకాయ కూలర్ (Mint & Lime Cooler)

చాలా తక్కువ సమయంలో తయారయ్యే సింపుల్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది. దీనికి కావాల్సినవి..

1 కప్పు తాజా నిమ్మరసం

పుదీనా ఆకులు

1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి

ఐస్ వాటర్

ఐస్ క్యూబ్స్

తయారీ విధానం: పుదీనాను కొద్దిగా నలగగొట్టండి. అందులో నిమ్మరసం, బెల్లం పొడి వేసి బాగా కలపండి. చివరగా ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి.

3. స్ట్రాబెర్రీ బాసిల్ స్మాష్ (Strawberry Basil Smash)

చూడటానికి చాలా స్టైలిష్‌గా, రుచిగా ఉండే డ్రింక్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే..

5-6 స్ట్రాబెర్రీలు

6-8 తులసి ఆకులు

20 మి.లీ. సింపుల్ సిరప్

20 మి.లీ. నిమ్మరసం

క్లబ్ సోడా

ఐస్

తయారీ విధానం: స్ట్రాబెర్రీలు, తులసి ఆకులు, సిరప్, నిమ్మరసం కలిపి మెత్తగా చేయాలి. తర్వాత ఐస్ వేసి షేక్ చేసి గ్లాసులో వడకట్టండి. పైన క్లబ్ సోడా పోసి సర్వ్ చేయండి.

4. మ్యాంగో మింట్ కూలర్ (Mango Mint Cooler)

మామిడికాయ రుచితో ఉండే ఈ డ్రింక హోలీ రోజుకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీని తయారుకు కావాల్సింది..

1 కప్పు మామిడి గుజ్జు

8–10 పుదీనా ఆకులు

½ నిమ్మకాయ రసం

1½ కప్పుల ఐస్ వాటర్ (లేదా సోడా)

ఐస్

తయారీ విధానం: మామిడి గుజ్జు, పుదీనా, నిమ్మరసం కలిపి బ్లెండ్ చేయండి. తర్వాత ఒక జగ్‌లోకి తీసుకుని నీరు లేదా సోడా కలిపి, ఐస్ వేసి సర్వ్ చేయండి. అంతే మీ డ్రింగ్ తయారు అయిపోయింది.

5. బెర్రీలిసియస్ (Berrylicious)

కొంచెం కొత్తగా, డిఫరెంట్ టేస్ట్‌తో ఉండే డ్రింక్ ఇది. దీనికి కావాల్సింది..

90 మి.లీ. ఎర్ర ద్రాక్ష రసం

10 మి.లీ. కలబంద (Aloe) సిరప్

20 మి.లీ. బ్లాక్‌బెర్రీ ప్యూరీ

కొంచెం సముద్రపు ఉప్పు

తయారీ విధానం: ద్రాక్ష రసం, కలబంద సిరప్, బ్లాక్‌బెర్రీ ప్యూరీ కలిపి షేక్ చేయండి. తర్వాత గ్లాసు అంచుకు ఉప్పు పూసి, అందులో ఈ మిశ్రమాన్ని వడకట్టి సర్వ్ చేయండి. అంతే మీ డ్రింక్ రెడీ అయిపోతుంది. సింపుల్‌గా రెడీ చేసుకునే ఈ డ్రింక్స్‌ని మీ ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేయండి.

Tags:    

Similar News