హ్యాపీ అవర్‌.. జీవితంలో ఇంకేమి కావాలి!

Update: 2019-09-07 15:07 GMT

ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంపాదనే ధ్యేయంగా మారిపోయింది. వ్యక్తిగత జీవతం కంటే వృత్తి పరమైన ఆంశాలకు ఎక్కువ ప్రాధన్యం ఇస్తున్నారు. చివరకు ఇంట్లో ఉండే పిల్లలతో కూడా సరదాగా గడపలేకపోతున్నారు. వారికి సరదాగా కబుర్లు చెప్పి.. మనసారా నవ్వేటట్లు ఉంచాలన్న అవసరాన్ని మరిచిపోతున్నారు. ఇంట్లో ఉన్నా.. ఆఫీస్లో ఉన్నా తల్లిదండ్రులు తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతో నాలుగైదేళ్లు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల వద్ద కంటే.. పాఠశాలల్లోనే ఎక్కువ సేపు ఉంటున్నారు. పేరెంట్స్ అదరణ లేక పిల్లల భవిష్యత్తు శాపంగా మారుతోంది. దీంతో వివిధ పాఠశాలలు కొత్త ఒరవడికి తెరదీశాయి. ఒక్కో సబ్జెక్టుకు గంట కేటాయించినట్టే.. ఇప్పుడు 'హ్యాపీ అవర్‌'ను పెడుతున్నాయి.

సాదరణంగా పాఠశాల సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తరగతులు జరుగుతూ ఉంటాయి. దీంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 మధ్యన ఒక గంట 'హ్యాపీ అవర్‌'గా నిర్వహించాలని నిర్ణయించాయి. వీటిలో ప్రముఖమైనది పాఠశాల రేడియో కార్యక్రమాల రూపకల్పన. ఇందులో పిల్లలు స్వయంగా వచ్చి వారిని టాలేంట్ పదర్శించడం. పాటలు,మాటలతో ఇతర విద్యార్థులకు అలరిస్తారు. రైమ్స్‌, కవితలు, జోక్‌లు ఇలా విద్యార్థులందరిని ఆనంద పరవశులయ్యేలాలో మునిగిలేచేస్తారు. వారి బుడిబుడి మటలు పిల్లల నోటంట వినాలే కాని.. నవ్వును ఆపుకోలేము.

ర్యాంకులు వేటలో విద్యార్థులు సంతోషాన్ని కోల్పోతున్నారు. ఉదయం నిద్ర లేచిన నుంచి అంతే రాత్రి పడుకునే వరకు అంత హడావుడే. ఉదయం హడావుడిగా బస్సెక్కడం, సాయంత్రం వరకు స్కూల్లో ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్లు, హోంవర్కులు ఇలా క్షణం తీరిక లేకుండా సాగిపోతోంది చిన్నారుల జీవితం. ఇలాంటి తరుణంలోనే కొంతైనా ఆనందాన్నిచ్చే పనుల్లో నిమగ్నమవ్వాలి. అప్పుడు మనసు ఉండగలుగుతుంది. ఓత్తిడి తగ్గుతుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, భూటాన్‌ దేశాలు సంతోషాలను లెక్కించే విధానాన్ని అమలు చేస్తున్నాయి. సంతోషంలోని సారాంశాన్ని భూటాన్‌ అర్థం చేసుకున్నాయి. ప్రపంచానికి స్థూల జాతీయ ఆనందం (గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌) అనే భావనను కలిగించాయి. ఇప్పుడు చాలా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, సంఘాలు ఇప్పుడు ఆనందం కోసం కొత్త బాటల్లో నడుస్తున్నాయి.

Tags:    

Similar News