శ్రీలంక పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న వైసీపీ నేత

Update: 2019-04-23 14:23 GMT

శ్రీలంకలో బాంబు పేలుళ్లు మారణహోమం సృష్టించాయి. ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదులు బాంబు పేలుళ్ల థాటికి 300మందికి పైగా అసువులుబాసారు. ఈ ఘటనలో పదిమందికి భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు భారతీయులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ పేలుళ్ల థాటి నుంచి వైసీపీ నేత అమర్ నాథ్ ప్రాణాలతో గట్టేక్కారు. పేలుళ్లు సంభవించిన సమయంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ శ్రీలంకలోనే ఉన్నారు. ఎన్నికల అనంతరం స్నేహితులతో కలిసి అమర్ శ్రీలంకకు వెళ్లారు. శ్రీలంకలో జరిగిన మారణహోమం నుండి తృటిలో తప్పించుకుని బయటపడ్డానని విశాఖ వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అప్పటి వరకు అందమైన కొలంబో ప్రాంతాలు ఒక్కసారిగా రక్తంతో తడిసిపోయిన దృశ్యాలు తలచుకోవడానికే కష్టంగా ఉందన్నారు. ముష్కరుల దాడులను ముక్త కంఠంతో ప్రపంచమంతా ఖండించాలన్న గుడివాడ అమర్‌ నాథ్‌ అన్నారు.

Similar News