తెలంగాణలో జరిగిన అవమానం ఏపీ ప్రజలకు తెలియాలి: వీహెచ్

Update: 2019-04-18 09:04 GMT

ఇటివల హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి చెత్తకుప్పలో వెసిన విషయం తెలసిందే. దీనిపై ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ఆయా పార్టీల ధర్నకూడా నిర్వహించిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో తెలంగాణలో డా. బిఆర్ అంబేద్కర్‌కు జరిగిన అవమానాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. తూ.గో జిల్లా కాకినాడలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ అంబేద్కర్‌కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా చేయబోతున్నట్లు వి. హనుమంతరావు ప్రకటించారు.

ఇదే సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీరుపై కూడా వీహెచ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఓవరాక్షన్ చేస్తోందని, తాను 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల కమిషన్‌ ఏనాడూ ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎస్‌ను అకారణంగా తొలగించారని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిచడం లేదని ఆరోపించారు. బీజేపీ పెద్దలు ఎవరిపై దాడి చేయమంటే వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని, అసలు దేశంలో అన్ని వ్యవస్థలనూ మోడీ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని హనుమంతరావు ఆరోపించారు.

Similar News