నన్ను వదలెయ్యండి.. లగడపాటి పై వర్మ ఫన్నీ ట్వీట్

Update: 2019-05-23 09:07 GMT

రాజకీయాల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు గాంచిన లగడపాటి రాజగోపాల్ ఈ మధ్య వరుసగా అయన సర్వేలు ఫెయిల్ అవుతున్నాయి .. తెలంగాణ ఎన్నికల్లో బోర్లా బొక్కలో పడ్డ అయన మళ్ళీ ఇప్పుడు ఆంధ్రా ఎన్నికల్లో కూడా అయన సర్వే ఓ బోగస్ సర్వే అని తేలిపోయింది ..

ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన లగడపాటి.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని జోస్యం చెప్పాడు. ఇతర జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఏపీలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెబితే.. ఈయన ఒక్కడు మాత్రం ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారం అంటూ పనికిమాలిన సర్వేను ప్రకటించాడు. 

కానీ అయన సర్వేకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ  ప్రస్తుతం 150 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. అయితే దీనిపై నెటిజన్లు ఫుల్ సటైర్లు వేసుకుంటున్నారు . అయితే దీనిపైన ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  కూడా ఓ ట్వీట్ చేసారు .. 

నన్ను వదలెయ్యండి.. ఇంకెప్పుడూ ఇక సర్వేలు చెయ్యను.. అంటూ లగడపాటి అంటున్నట్టు.. ఆయన్ను కొందరు వ్యక్తులు ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు ఉంది ఆ ఫోటో. నెటిజన్లు కూడా లగడపాటిని ఎలా ఆడుకున్నారో మీరే చూడండి.


Similar News