కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ..

Update: 2019-04-22 15:19 GMT

ఇంటర్ ఫలితాల చిచ్చు తారా స్థాయికి చేరుతోంది. ఇంటర్ ఫలితాల ప్రకటనలో గందరగోళం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా లేఖ రాశారు. మార్కుల్లో గందరగోళానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బాధ్యుడని వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలని లేఖలో కోరారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 9.45 లక్షల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని, ఫలితంగా 3 రోజుల్లో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రతిరోజు 40 పేపర్లు దిద్దాల్సిన లెక్చరర్లు 65 పేపర్లు దిద్దారని ఉత్తమ్ లేఖలో ఆరోపించారు. మంచి మార్కులు వచ్చే విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని సూచించారు.

Similar News