వైరల్ అవుతున్న ఉపాస‌న ట్వీట్..

Update: 2019-06-03 05:44 GMT

రామ్‌చ‌ర‌ణ్‌పై ఉపాస‌నకు.. ఉపాస‌న‌పై రామ్‌చ‌ర‌ణ్‌కు ఉన్న ప్రేమ‌కు అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా వేదికగా నిలుస్తుంటుంది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ స‌మ్మ‌ర్ వెకేష‌న్ కోసం ఆఫ్రికా వెళ్లారు. అక్క‌డ ఫారెస్ట్‌లో జంతువుల మ‌ధ్య తిరుగుతున్నారు. ఈ వెకేష‌న్‌లో భాగంగా అక్క‌డ‌క్క‌డ తీసుకున్న కొన్ని ఫోటోల‌ను ఉపాస‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా ఉపాస‌న పోస్ట్‌ చేసిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలో ఆమె రెండు సింహ‌పు పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఆడుకుంటోంది. అలాగే ఈ ఫోటోతో పాటు ``అస‌లు రామ్‌చ‌ర‌ణ్ న‌న్నెందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు అర్థ‌మైయ్యే ఉంటుంది. ప్ర‌కృతి మాత‌ను గౌర‌వించ‌డం, క్రూర జంతువుల‌ను కూడా గ‌మ‌నించి, వాటి నుండి కూడా కొన్ని పాఠాల‌ను నేర్చుకోవాల‌ని తెలుసుకున్నాం. మ‌నం మ‌న చుట్టూ ఉండే ప్ర‌కృతిని, జంతువుల‌ను గౌర‌వించాలి. చిన్న‌మార్పే పెద్ద తేడాను ఏర్ప‌రుస్తుంది`` అంటూ స్పందించారు ఉపాస‌న. ఇపుడు ఈ ట్విట్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది.




 



Similar News