వీవీప్యాట్‌ స్లిప్పులు బయటకు రావడంపై ఈసీ యాక్షన్‌...ఆర్వో, ఏఆర్వో సస్పెండ్‌

Update: 2019-04-26 05:19 GMT

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వెలుగుచూసిన వీవీప్యాట్‌ స్లిప్పుల అంశంపై ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఆత్మకూరు ఆర్‌వో చిన్నరాముడు, వీఆర్వో విద్యాసాగరుడు లను సస్పెండ్‌ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 న ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కట్టలుగా ఉన్న వీవీప్యాట్‌ స్లిప్పులు కనిపించాయి. సంచలనం సృష్టించిన ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారించిన డీఎస్పీ వెంకటాద్రి నివేదికను కలెక్టర్‌కు అందజేయగా దాన్ని ఈసీకి పంపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వీవీప్యాట్‌ స్లిప్పులు బయటకు వచ్చాయని నిర్ధారించిన ఈసీ ఆర్వో, వీఆర్వోలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Similar News