లోకేష్‌కు ట్రాన్స్ జెండర్ సవాల్‌..

Update: 2019-03-25 10:53 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్‌కు దమ్ము ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసీ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగాలని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మంత్రి లోకేశ్‌కు సవాల్‌ విసిరారు. ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తమన్నా సింహాద్రి మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్ జెండర్ గా ప్రజాసేవకై తాను ముందుకు వస్తున్నానని మంగళగిరి ప్రజలు తనకు ఓట్లు వేసీ భారీ మెజారిటీతో గెలిపించాలిని తమన్నా సింహాద్రి కోరారు. జనసేన పార్టీకి తాను దరఖాస్తు చేసుకున్నాకానీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. నారా లోకేష్ బాబుకు మంగళగిరిలో ఓటమి తప్పదని, తాను ఎన్నికల బరిలో దిగుతున్నని తెలిసి అప్పుడే లోకేశ్ బాబు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.  

Similar News