నేడు తిరుమలకి మోడీ ..

Update: 2019-06-09 02:01 GMT

నేడు సాయింత్రం తిరుమలకి రానున్నారు దేశ ప్రధాని మోడీ .. ఇవాళ ఉదయం శ్రీలంక పర్యటనకు వెళ్తున్నారు. ఈ టూర్‌లో ఆయన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరుపుతారు మోడీ . మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇది మూడోసారి. ఇదివరకు ఆయన 2015, 2017లో వెళ్లారు. మోదీ ఉదయం 11 గంటలకు శ్రీలంక రాజధాని కొలంబో చేరుకుంటారు. అధ్యక్షుడు సిరిసేన ఇస్తున్న మధ్యాహ్న విందుకు హాజరవుతారు. తర్వాత సిరిసేనతో చర్చలు జరుపుతారు. కొలంబోలో చర్చల తర్వాత మోదీ తిరుమలకు రాబోతున్నారు.

నేటి సాయంత్రం 4.30కు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు ప్రధాని మోదీ. ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత విమానాశ్రయానికి దగ్గర్లోనే బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ సభకు విజయోత్సవ సభగా పేరు పెట్టారు. సభలో పాల్గొన్న తర్వాత మోదీ... రోడ్డు మార్గాన తిరుమల చేరుకుంటారు.

గెస్ట్ హౌస్‌లో 20 నిమిషాల విశ్రాంతి తర్వాత ప్రధాని మోదీ... వెంకన్న స్వామి దర్శనానికి బయల్దేరతారు. సాయంత్రం 6 గంటలకు వరాహ స్వామిని దర్శిస్తారు. తర్వాత శ్రీవారి ఆలయంలో పూజలు చేస్తారు. రాత్రి 7.20కి మోదీ రోడ్డు మార్గాన తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచీ ప్రత్యేక విమానంలో రాత్రి 8.30కి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

Full View

Tags:    

Similar News