ఒడిశాలో అత్యంత అరుదైన తాబేలు లభ్యం..

Update: 2019-06-16 06:58 GMT

ఒడిశాలో అత్యంత అరుదైన తాబేలు కనిపించింది. కలహండి జిల్లా ధరమ్‌గఢ్‌ ప్రాంతం భిమ్‌ఖోజ్‌ రోడ్‌ సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బిజు ఎక్స్‌ప్రెస్‌ వేపై నిర్మాణ పనులు జరుగుతుండగా..తాబేలును కార్మికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారమందించారు. తాబేలు 42 కిలోల బరువుండగా..అది అత్యంత అరుదైన జాతికి చెందినదని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం తాబేలును జూకు తరలించినట్లు చెప్పారు.

Tags:    

Similar News