తెలంగాణను అపహాస్యం చేసిన వాళ్లే.. అవాక్కవుతున్నరు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Update: 2019-06-02 03:53 GMT

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఐదేళ్లలోనే అధ్బుత ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవంగా అమరవీరుల స్థూపానికి కేసీఆర్ ఘననివాళి అర్పించారు. పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వేడుకల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్నీ రంగాల్లో తెలంగాణ ప్రగతిపథంలోకి దూసుకుపోతుందని కేసీఆర్ తెలిపారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటంతో సాధించామని కేసీఆర్ చెప్పారు. ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు అధిగమించామన్నారు. గతంలో అపహాస్యం చేసినవారు ఇప్పుడు తెలంగాణ ప్రగతిని చూసి షాక్ తింటున్నారని కేసీఆర్ చెప్పారు.

దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధిస్తున్నాయని చెప్పారు. పెంచిన పెన్షన్లు జూలై ఒకటి నుంచి అందుతాయని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని కేసీఆర్ వెల్లడించారు. కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ తన మానసపుత్రికలు అని కేసీఆర్ చెప్పారు. జూలై నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి అవుతాయన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని తెలిపారు. 

Similar News