ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగియగా రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

Update: 2019-01-21 09:28 GMT

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగియగా రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్‌ అంతా ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 4 వేల 479 పంచాయతీల్లో 769 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 39 వేల 822 వార్డుల్లో 10 వేల 654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3 వేల 701 పంచాయతీలు, 28 వేల 976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12 వేల 202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70 వేల 94 మంది బరిలో ఉన్నారు. 

Similar News