యువతి కిడ్నాప్‌ కలకలం.. కారు డోర్‌కు వేలాడుతూ..

Update: 2019-04-30 13:03 GMT

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. తల్లితో కలిసి వెళ్తున్న యువతిని కారులోకి లాక్కెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన తల్లి అరుణకుమారి కారు డోర్‌ను పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా దుండగుడు కారును ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు కారును వెంబడించారు. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కారును అడ్డుకున్న స్థానికులు యువతిని రక్షించారు. దుండగుడిని పట్టుకుని చితకబాదారు. అతన్ని పాలకోడేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ కాలేశ్‌ అనే యువకుడు వేధిస్తున్నాడని చెబుతున్నారు. ప్రేమ పేరుతో యువతిని కిడ్నాప్‌ చేసేందుకు కాలేశ్‌ యత్నించారని బాధితులు తెలిపారు.

Full View  

Similar News