ఎవరి పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం టీడీపీకి లేదు: ఎంపీ కొనకళ్ల

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుభవ రాహిత్యంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు.

Update: 2019-01-24 07:18 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుభవ రాహిత్యంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. ఎవరి పథకాలను కాపీ కొట్టాల్సిన దుస్ధితిలో తాము లేమని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ టీడీపీలోనే శిక్షణ తీసుకున్న విషయం మరచిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో ఏపీతో తెలంగాణ ఎప్పటకీ పోటీ పడలేదన్నారు. ఏపీ వ్యాప్తంగా తాము 18 లక్షల ఇళ్లు నిర్మిస్తే తెలంగాణ ప్రభుత్వం 10 వేల ఇళ్లకే సరిపెట్టిదన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ కొనకళ్ల సూచించారు. దేశ సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగితే ఎన్‌ఐఏకి అప్పగించడం సరికాదన్నారు. రాష్ట్ర దర్యాప్తు సంస్ధలను అపహాస్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కాపుల రిజర్వేషన్‌ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు రోజుకో మాట పూటకో బాట పడుతున్నారంటూ విమర్శించారు.  

Similar News