తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Update: 2019-01-28 08:17 GMT

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం పరిధిలోని ఏడు మండలాల ఓటర్లను ఏపీలో చేరుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏడు మండలాల ఓటర్లను ఏపీలో చేర్చామంటూ ఈసీ తరపు న్యాయవాది వివరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌కు అనుగుణంగానే తాము నడుచుకున్నట్టు కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో హైకోర్టులో కేసును కొట్టి వేసిన విషయాన్ని కూడా తెలియజేశారు. రాజ్యాంగ బద్ధంగా శాసన, కార్యనిర్వాహక శాఖలు నిర్ణయం తీసుకున్నందున తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రకటించింది.  

Full View

Similar News