జైల్లో పుస్తకం రాసిన కోడికత్తి కేసు నిందితుడు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు రచయితగా మారిపోయాడు. ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న శ్రీనివాస్‌ ఓ పుస్తకం రాశాడు. తనలో మార్పు కోసమే శ్రీనివాసరావు ఈ పుస్తకం రాసినట్టు అతని తరపు లాయర్‌ చెబుతున్నారు.

Update: 2019-01-05 04:23 GMT
jagan

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు రచయితగా మారిపోయాడు. ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న శ్రీనివాస్‌ ఓ పుస్తకం రాశాడు. తనలో మార్పు కోసమే శ్రీనివాసరావు ఈ పుస్తకం రాసినట్టు అతని తరపు లాయర్‌ చెబుతున్నారు. జైల్లో శ్రీనివాసరావు రాసిన పుస్తకం విడుదలకు న్యాయవాది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై న్యాయమూర్తికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందజేసినట్లు న్యాయవాది సలీం చెబుతున్నారు.

శ్రీనివాసరావు ఇప్పటికీ జగన్ అభిమానిగా ఉన్నారని క్రిస్మస్, న్యూ ఇయర్‌కు జగన్, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పాలని నిందితుడు కోరుకున్నట్టు లాయర్‌ సలీం చెబుతున్నారు. సరైన ఆధారం లేని కేసులో శ్రీనివాసరావును ఇబ్బందులు పెడుతున్నారని సలీం ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావును జగన్‌ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లి మాట్లాడించి ఈ కేసును ముగించాలని చూస్తున్నట్టు ఆయన తెలిపారు.

Full View

Similar News